ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా పోలీసుల వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అయింది. ఇక తాజాగా చంద్రబాబుని చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళకుండా అడ్డుకోవడంపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. నోటీస్ చూస్తే పోలీసులు బుర్ర పెట్టి పని చేస్తున్నారా లేదా అర్థం కావడం లేదు అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు ఆటంకం కలుగుతుందని పోలీసులు అడ్డుకుంటున్నారని అడ్డుకుంటున్నారా అని నిలదీశారు.

పట్టణ ప్రాంతంలో ప్రజలు చాలా కోపంతో ఉన్నారు ప్రజలు ఓటు ద్వారా జగన్మోహన్రెడ్డిని, చితక కొట్టడానికి  సిద్ధంగా ఉన్నారు అని ఆయన ఎద్దేవా చేసారు. అభ్యర్థులను భయపెట్టి, యునానిమస్ చేసుకోవాలని కుట్ర వైసీపీ చేస్తుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని అన్నారు. ఎస్పీని కలెక్టర్ ని కలవటానికి వెళితే ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు.  విశాఖపట్నంలో ఒక బ్రోకర్  పాదయాత్ర చేసి  అంబులెన్స్ ల కు అడ్డు పడినప్పుడు మీకు  కు కనిపించలేదా అని నిలదీశారు.

చంద్రబాబు ఎయిర్పోర్ట్ ని బయటికి వెళ్లకుండా ఇబ్బందులను చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు కుక్కలా తిరిగాడు అప్పుడు ఆ రోజు పోలీసులు సపోర్ట్ ఇచ్చాము అని ఆయన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పోలీసులు క్షమాపణ చెప్పి బందోబస్తు  ఇచ్చి తీసుకువెళ్లాలి అని ఆయన డిమాండ్ చేసారు. మొత్తం వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో నడుపుతున్నారు అని అన్నారు.  మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు ప్రజలు తిరగబడవలసిన అవసరం ఉంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి సారి, క్యాంపులు పెట్టే దుస్థితి తీసుకొచ్చారు అని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఇదంతా చేస్తున్నారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: