సాధారణంగా పెళ్ళి అంటే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బంధుమిత్రులు అందరూ పెళ్లి వేడుకకు హాజరై... ఎంతో ఘనంగా పెళ్లి జరుగుతూ ఉంటాయి. పెళ్లి అంటే కేవలం జీవితంలో ఒకే సారి మాత్రమే వచ్చే వేదిక కావడంతో.. అందరూ తమ పెళ్లి ని ఎంతో బాగా జరుపుకోవాలి అని అనుకుంటారు. ఇప్పటివరకు వధూవరులు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడం చూసే ఉంటారు. వధూవరులు లేకుండా పెళ్ళి జరగడం అసాధ్యం. కానీ ఇక్కడ వరుడు లేకుండానే పెళ్లి జరిగిపోయింది.



 ఇటీవలే ఓ వ్యక్తి ఏకంగా ప్రియురాలు బ్రేకప్ చెప్పింది అనే కారణంతో అందరు బంధువుల మధ్య భారీగా పెళ్లి ఏర్పాట్లు చేసి తనను తాను పెళ్లి చేసుకున్న  ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఓ యువకుడు తనను తానుపెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొన్న ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పింది అని తనను తాను పెళ్లి చేసుకుంటే ఇక ఇప్పుడు ఒక అమ్మాయి ఇదే తరహా డెసిషన్ తీసుకోండి.



ఆమె  ఒక అబ్బాయిని ఎంతో గాఢంగా ప్రేమించింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అతనితోనే జీవితం అని ఊహించుకుంది.. కానీ అనుకోని విధంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇక ఆ అబ్బాయి యువతికి బ్రేకప్ చెప్పాడు. దీంతో వేరొకరిని పెళ్లి చేసుకో లేక తనను తానే పెళ్లి చేసుకుంది యువతి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మెక్ టేలర్  అనే యువతి ఇలా చేసింది. బంధుమిత్రులు అందరి సమక్షంలో తనని తాను పెళ్లి చేసుకోవడమే కాదు..  రింగ్  తన చేత్తో తన చేతికే  తొడుక్కుంది. ఇక అద్దంలో తన ప్రతిబింబానికి తానే ముద్దు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: