ప్రస్తుతం నేటి సమాజంలో గురువుకి అత్యున్నత స్థానం ఉంది అనే విషయం తెలిసిందే. గురువు అంటే నేటి బాలలనే  రేపటి పౌరులు గా తీర్చి దిద్దెవాడు. విద్యాబుద్ధులు నేర్పించడమే  కాదు లోకజ్ఞానాన్ని కూడా నేర్పిస్తాడు. తల్లిదండ్రులు లోకం లోకి వచ్చేందుకు జన్మనిస్తే గురువులు... ఈ లోకం తీరు అర్థమయ్యేలా చెబుతూ ఉంటారు అంతే కాదు విద్యార్థులు సన్మార్గంలో నడిచే విధంగా ఎప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అందుకే తల్లిదండ్రుల తర్వాత దైవం గురువు అని చెబుతూ ఉంటారు పెద్దలు.  అంత అత్యున్నత స్థానంలో ఉన్నకొంతమంది గురువులు చేస్తున్న పనులు మాత్రం నీచాతి నీచంగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 సాధారణంగా గురువులు అంటే పిల్లలకు మంచి చెడు బోధిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అనే విషయం తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం కొంతమంది ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉండటం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఏకంగా విద్యాబుద్ధులు నేర్పడం కాదు గురువులే స్వయంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  చెడు దారులలో వెళుతున్న విద్యార్థులను మందలించి సక్రమ దారిలో నడిపించాల్సిన గురువు ఏకంగా ... విద్యార్థులకు చెడు అలవాట్లు నేర్పించాడు.



 ఏకంగా విద్యార్థునులకు నీలిచిత్రాలు చూపిస్తూ కీచక ఆనందాన్ని పొందుతున్నాడు  ఇక్కడ గురువు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థునుల పట్ల దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఏకంగా విద్యార్థునులకు నీలిచిత్రాలు చూపిస్తూ ఇబ్బందులకు గురి చేసే వాడు. ఇక రోజురోజుకు గురువు వేధింపులు ఎక్కువవడంతో ఇక ఓ రోజు ధైర్యం తెచ్చుకుని విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఇక గ్రామస్తులు అందరూ కలిసి ఆ గురుకుల పాఠశాలలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న డీఈవో  అక్కడికి చేరుకుని..  ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: