ఇప్పుడు చాలా మంది చేతుల్లో కామన్ గా కనిపించేది ఏంటి అంతే స్మార్ట్ ఫోన్ అనడంలో అతిశయోక్తి లేదు. ఫోన్ లేనిది కాలక్షేపము కూడా అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మీ స్మార్ట్ ఫోన్ కి ఎమన్నా అయితే తట్టుకుంటారా.. lలేదు కదా.. మనలో చాలా మంది  తమ స్మార్ట్ ఫోన్లని వదిలేసి కొత్త ఫోన్లు కొంటున్నారంటే  దానికి కారణం అందులో బ్యాటరీ సరిగా వర్క్ చేయకపోవడమే. అయితే అప్పటిలా కాకుండా ఈమధ్య  వచ్చిన ఫోన్లలో ఎక్కువగా  బ్యాటరీలని మార్చుకునే సౌకర్యం లేదు. ప్రతీ స్మార్ట్ ఫోను  బ్యాటరీ తీయడానికి వీలు లేకుండానే వస్తుంది. అయితే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ తొందరగా పాడవకుండా ఎక్కువ కాలం  ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం



సాధారణంగా మన వాడే ఫోన్స్ లో లిథియం ఐయాన్ బ్యాటరీలు ఉంటాయి. వాటి యొక్క జీవిత  కాలం 500సైకిల్స్ గా ఉంటుంది. అంటే సంవత్సరంన్నర కాలం వీటి లైఫ్ ఉంటుంది అన్నమాట. అందుకే వీటిని వాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు ఒక  ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళినపుడు మీ ఫోన్ తో పాటు మే ఛార్జర్ కూడా తీసుకువెళ్ళండి. అంతేకానీ, అక్కడ ఉన్న వేరే మొబైల్ ఛార్జర్ తో ఛార్జ్ పెట్టవద్దు.అలా చేయడం వలన బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గుతుంది.  ఎందుకంటే మీ బ్యాటరీకి సరిపడా వోల్టుల ఛార్జర్ అక్కడ ఉండకపోవచ్చు. దానివల్ల బ్యాటరీపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది.  


ఎప్పుడైనా సరే ఫోన్లో ఛార్జింగ్  వందశారం పెట్టకూడదు. కేవలం 85శాతం మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. లిథియం బ్యాటరీలని వందశాతం ఛార్జ్ చేయడం వల్ల అవి ఉబ్బి పాడయ్యే అవకాశం ఉంది. ఇంకా, బ్యాటరీ పర్సెంటేజ్ 25శాతానికి తగ్గకముందేఛార్జింగ్ చేయాలి. జీరో మార్క్ చూపించి రెడ్ కలర్ వచ్చే దాక  వెయిట్ చేయడం సరికాదు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ఎక్కువకాలం మీ బ్యాటరీతో పాటు,మీ ఫోను కూడా పని చేస్తుంది. మీకే డబ్బులు ఆదా అవుతాయి.. !!



మరింత సమాచారం తెలుసుకోండి: