దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరో వైపు వేసవి కాలం హీటు కూడా అలాగే  ఉంది. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేడి, ఎండ వేడి సంగతి ఎలా ఉన్నా కూడా ఏపీలో మాత్రం రాజకీయ కాక ఒక రేంజిలో ఉంది. అది ఆగేట్లు కూడా లేదు. జరుగుతున్నవి స్థానిక ఎన్నికలు, ఇక్కడ కుర్చీ దక్కకపోతే పోయేది కూడా ఏమీ లేదు.

గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు లోకల్ బాడీ ఎన్నికలను పెద్దగా పట్టించుకునే వారే కారు, అసలు వాటిని పూర్తిగా   స్థానిక నేతలకే వదిలిపెట్టేసేవారు. తెలుగుదేశం వచ్చాకే లోకల్ బాడీలకు కూడా పాలిటిక్స్ బాగా తగులుకుంది. ఇక చంద్రబాబు జమానాలో అయితే సహకార సంఘాలకు, సాగునీటి సంఘాల ఎన్నికలకూ కూడా రాజకీయ కాక అంటించారు.

పంచాయతీ ఎన్నికల నుంచి టీడీపీ పెద్దలు ఒక్క లెక్కన గొంతు చించుకుంటున్నారు. మునిసిపల్ ఎన్నికల వేళ ఏకంగా చంద్రాబాబు నేరుగా  వీధుల్లోకే వచ్చేశారు. ఆయన రేణిగుంట ఎయిర్ పోర్టులో దీక్ష చేయడం, హడావుడి చేయడం ఆయన రాజకీయ అనుభవానికి ఏమాత్రం తగనివి అంటున్నారు. చంద్రబాబు ఎంత విపక్షంలో ఉన్నా కూడా ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నారు. ఆ స్టేచర్ ఆయన మెయింటెయిన్ చేయాలని కూడా అంతా కోరుకుంటారు.

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల్లో సలహా సూచనలు ఇచ్చి వాటిని పార్టీ నాయకులకు బాబు లాంటి వారు అప్పగించి ఊరుకుంటే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది. కానీ బాబు అలా ఊరుకునే రకం కాదుగా, ఆయనే ముందుకు వచ్చి అన్నీ తానే చూసుకుంటాను అంటునారు. సరే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందే  అనుకుందాం, లాభమేంటి. మరో మూడేళ్ళ పాటు జగన్ సీఎం గా ఉంటారు కదా. ఆ తరువాత రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు. అందువల్ల మునిసిపల్ ఎన్నికల కోసం ఇంతలా చొక్కాలు చింపుకొవడం ఎవరికీ మంచిది కాదు. లోకల్ బాడీలకు వాటి విలువ ఉంచుతూ ఆయా పార్టీల పెద్ద నాయకులు సైలెంట్ గా ఉండడమే మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: