జగన్ కి రాజకీయ అదృష్టం ఉంది.   కాబట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక  ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయిన రికార్డు ఒక్క జగనే ఉంది. ఇక జగన్ తాను వారసుడిగా కాకుండా నాయకుడిగానే పోరాడి సాధించుకున్నారు ముఖ్యమంత్రి సీటు. జగన్ సీఎం కుర్చీని వెనక పదేళ్ళ కష్టం ఉంది.

ఇదిలా ఉంటే జగన్ ఇలా కుర్చీ ఎక్కారో లేదో నేడో రేపో ఆయన దిగిపోతారంటూ టీడీపీ ప్రచారం మొదలెట్టేసింది. దానికి తోడు జమిలి ఎన్నికలు వస్తాయంటూ కూడా హడావుడి చేస్తూ వచ్చింది. జమిలి ఎన్నికలు వస్తే కనుక జాగన్  మూడేళ్ళకే దిగిపోతారని, ఇంకో ఏడాది ఓపిక పడితే చాలు ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు కూడా. అయితే జమిలి ఎన్నికల ఊసు ఇపుడు కేంద్రంలో ఎక్కడా వినిపించడం లేదుట. తాజా సమాచారం ప్రకారం చూస్తే అయిదేళ్ళూ పూర్తిగా అధికారం అనుభవించి తీరాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారుట.

బీజేపీ సంస్కరణలు మరీ ఓవర్ అయిపోయాయి. దేశంలో అన్నిరకాల నిత్యావసరాల  ధరలూ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక వ్యవసాయ చట్టాల మీద ఓ వైపు ఆందోళనలు దేశంలో జరుగుతున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో చూస్తే బీజేపీకి గట్టిగా దక్కేస్ది అస్సాం మాత్రమే అని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ పెద్దలు జమిలి ఆలోచనలు విరమించుకున్నారుట.

చేతిలో ఉన్న అధికారాన్ని వదులుకు ఎన్నికలకు వెళ్తే రాజకీయంగా అపార నష్టాన్ని ఎదుర్కొంటామని భావించడం వల్లనే ఈ రకంగా కమలనాధులు  పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. బీజేపీకి నిజానికి జమిలి ఎన్నికల మీద మోజు పోలేదు. కానీ ఇపుడు తగిన సమయం కాదని ఆ ప్రతిపాదన విరమించుకుందిట. దాంతో మొదట ఊపిరిపీల్చుకునేది జగనే అని చెప్పాలి. ఆయన కచ్చితంగా 2024 వరకూ అధికారంలో కొనసాగుతారు. అలాగే తనకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉండడంతో కొన్ని పనులు అయినా చేసి జనం ముందుకు వెళ్ళే చాన్స్ వస్తుంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: