తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త అధికార విపక్షాలకు ఇబ్బందికరంగా మారాయి అనే మాట వాస్తవం. రెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తాం అనే దానిపై రాజకీయ వర్గాలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన సరే పరిస్థితులు మాత్రం వేగంగా మారే అవకాశాలు ఉండవచ్చు.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె వాణీ కి ఎమ్మెల్సీ సీటు ఖరారు చేశారు సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు అక్కడ అనుకున్న విధంగా పరిస్థితులు లేకపోవడం తో చాలా వరకు కూడా సీఎం కేసీఆర్ లో ఒక రకమైన ఆందోళన కనపడుతుంది అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది.

వాస్తవానికి ఆమెకు సీటు ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్ కొన్ని అంశాలను అంచనా వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు కుటుంబాన్ని పక్కన పెట్టిందని తాను వాళ్లను ఆదరించా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పి.వి.నరసింహారావు కుమార్తె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. తన తండ్రి తర్వాత తెలంగాణకు న్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ ఆమె కొనియాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన లేకపోతే తక్కువ మెజార్టీతో గెలిచిన సరే అటు పీవీ నరసింహారావు కుటుంబం కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: