దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పై రాజకీయ పార్టీలు ప్రజలకు మంచి అవగాహన కల్పిస్తున్నాయి. ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ పై భయం ఉన్న నేపధ్యంలో రాజకీయ పార్టీల అధినేతలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకు వచ్చి సూచనలు సలహాలు చేస్తున్నారు. ఇక నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ వేసుకుని దేశ ప్రజలకు మంచి సంకేతం ఇచ్చారు. దీనిపై రాజకీయ పక్షాలు అన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే మజ్లీస్ పార్టీ కార్యాలయం..  దారుస్సలాంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అని కోరారు. తమను తాము కాపాడుకోవాలి  అని ఆయన సూచించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ తీసుకున్నరు మంచిదే కానీ మోడీ ప్రభుత్వం పేద మధ్య తరగతి కుటుంబాలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాక్సీన్ ని తక్కువ ధరకే అందుబాటులో ఉండే విధంగా చూడాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. తాను కూడా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటాను అని స్పష్టం చేసారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను పరిశీలించాలి అని ఆయన సూచించారు. జర్నలిస్టులకు వ్యాక్సిన్ అందజేయాలి  అని అన్నారు.

కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ లో ఉండి కృషి చేసిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు వ్యాక్సిన్ ఇప్పించాలి అని ఆయన కోరారు. కోవిడ్ వాక్సిన్ పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. 18 సంవత్సరాల నుండి 64  సంవత్సరాల వారు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏం కాదు అని పేర్కొన్నారు. కానీ 64 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనా దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: