మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పని గట్టుకుని తిరుపతి విమానాశ్రయం దిగి చిత్తూరులో ధర్నా చేస్తానంటున్నాడు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని,కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నది చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. టిడిపి తరపున నామినేషన్ వేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు గాంధీ తరహాలో చేయాలనుకున్నా చేయలేడని అన్నారు.

చంద్రబాబు నాయుడిది కేవలం రాజకీయ డ్రామా మాత్రమే అని ఆయన స్పష్టం చేసారు. గతంలో ఎన్నికల నిబంధనల్లేవు,కోవిడ్ నిబంధనల్లేవు సమైక్యాంధ్ర సమైక్యతను చాటి చెప్పేందుకు అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నంలో రన్ వే పైనే అడ్డుకున్నారని మంత్రి గుర్తు చేసారు. నానా యాగి  చేస్తున్న చంద్రబాబు నాయుడి డ్రామా.. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.  చంద్రబాబు నాయుడు అసలు ఈ పర్యటన ఎందుకు చేస్తున్నాడా అని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా,కోవిడ్ సెకండ్ వేవ్ విస్తృతంగా ఉందని ఎన్నికల అధికారులు, పోలీసులు లేఖలు రాసినా చంద్రబాబు నాయుడు లెక్క చేయకుండా వచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు ఎమ్మెల్యేలను లాక్కొని మంత్రి పదవులు కట్టబెట్టారు అని ఆరోపించారు. అదే వైయస్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలోని ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే కూడా వారిని పార్టీలో చేర్చుకోలేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మీ ఆరోగ్యాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అధికారులను,పోలీసులను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళాలని సూచనలు చేసారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ఏ ఒకటి నేరవేర్చలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని ప్రజల్లోకి పంపుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేస్తున్నారని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: