దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ఏమో గాని ఇప్పుడు ఈ వ్యవహారం ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది అనే విషయం చెప్పవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ మీద చాలా గట్టిగా ఫోకస్ చేసింది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది. 432 ప్రభుత్వ, 92 ప్రయివేట్(ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ) వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చు అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఆయా ఆసుపత్రుల జాబితా ను cowin.gov.in  వెబ్ సైట్లో చూడొచ్చు అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ కోసం ఆన్ లైన్లో మాత్రమే  పేర్లు నమోదు చేసుకోవాలి అని స్పష్టం చేసింది. పేర్లు నమోదు చేసుకోకుండా సెంటర్ కు వెళ్తే  టీకా వేయరని స్పష్టం చేసింది. 45 నుంచి 59  ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి అని పేర్కొంది. 60 ఏళ్లు దాటిన వారూ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. లబ్ధిదారులు ఫోటో గుర్తింపు కార్డులను పోర్టల్/యాప్ లో  అప్లోడ్ చేయాలి అని స్పష్టం చేసింది.

ఫోటో గుర్తింపు కార్డులు ఒక్కసారి చూస్తే ఆధార్ కార్డు /ఆధార్ లెటర్ / ఓటర్ గుర్తింపు కార్డు‌ /పాస్ పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్ /పాన్ కార్డు /నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ స్మార్ట్ కార్డు/ ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్ కావాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది. హెల్త్ కేర్ , ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇంకా కొనసాగుతోంది అని పేర్కొంది. వీరు ఏ వ్యాక్సినేషన్ సెంటర్ కైనా వెళ్లి టీకా వేసుకోవచ్చు అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: