రహదారులు అన్ని రక్తపు మడుగుల తయారవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో చాల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొంత మంది అవయవాలు పోగొట్టుకొని నరకప్రాయంగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం నిర్లక్ష్యపు డ్రైవింగ్. ఇక రోడ్లపై ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎవరూ చూడటం లేదు కదా అనుకొని ఇష్టానుసారంగా రోడ్లపై రెచ్చిపోతున్నారు. అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారులపై సైతం ఇదే ధోరణి కనిపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా రోడ్లపై విహరిస్తున్నారు. దీని కారణంగా అమాయకులైన ప్రజలు ప్రమాదాల బారిన పడి అవస్థలు పడుతున్నారు.

అయితే బైక్ స్పీడ్ గా నడపొద్దురా బాబూ.. అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు అన్నందుకు దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. ‘నన్ను మోటార్ సైకిల్ నడపొద్దంటారా? నేను ర్యాష్ డ్రైవింగ్ చేస్తే నీ కెందుకు? నీ రోడ్డా?’ అంటూ గొడవకు దిగడంతో పాటు ఏకంగా ఒకరిని కత్తితో పొడిచి చంపాడు. బైక్ స్పీడ్ గా నడపొద్దురా బాబూ.. అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు అన్నందుకు దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు.

ఇక మరొకరి మీద కత్తితో దాడి చేయగా అతడికి గాయాలయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పీయూష్ శర్మ అలియాస్ కాకు అనే యువకుడు ఆదివారం రాత్రి మోటార్ సైకిల్ ర్యాష్‌గా నడుపుతూ వస్తున్నాడు. దీంతో అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు అంటూ సూరజ్, చందర్ అనే అన్నదమ్ములు వారించారు. ఈ విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. కాకు వెంటనే తన ఫ్రెండ్స్‌ను పిలిచాడు. అందరూ కలసి సూరజ్, చందర్ మీద కత్తితో దాడి చేశారు. ఈ గొడవలో సూరజ్ ప్రాణాలు కోల్పోయాడు. చందర్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు చందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు పీయూష్ శర్మ (19), సందీప్ శర్మ (31), శివ నారాయణ (32) ల మీద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: