చందాల పేరుతో కొత్త దందా చేస్తున్నారు. సెంటిమెంట్ తో డబ్బులు కాజేస్తున్నారు. అది కూడా అమ్మాయిలు కావడం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి యువతులు అనాథ ఆనాధాశ్రమాల పేరు చెప్పి ఈ దందా చేస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దందా జరుగుతుంది ఎక్కడో కాదు మన ఘట్ కేసర్ లోనే జరుగుతుంది. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్ , గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పలువురు యువతులు ఐదు బృందాలుగా ఏర్పడ్డారు. జాతీయ రహదారిపై నిర్మానుష ప్రాంతాలను టార్గెట్ చేసి ఈ దందా చేస్తున్నారు. వీరిలో ఒక గ్రూప్ ఘట్ కేసర్ లో రహదారిపై స్వచ్ఛంద సంస్థ పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. రోడ్డు పై వచ్చే పోయే వాహనాలను ఆపి డబ్బులు ఆడుతున్నారు. అంతే కాకుండా డబ్బులు ఇవ్వని వారిపై బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు.

దీనిపై కొంతమంది వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆరుగురు యువతులు ఎక్కడ నుండి వచ్చారు..ఎందుకు వచ్చారు..డబ్బులు అడగటం వెనక ఉదేశ్యం ఏంటని ప్రశ్నించారు. దాంతో ఆ యువతులు స్వచ్చంధ సంస్థ ప్రతినిధులమని సమాధానం ఇచ్చారు. కానీ వారి వద్ద ఎలాంటి ఆధారాలు లంబించలేదు. దాంతో విచారించగా యువతులు రాజస్థాన్ కు చెందిన వారిగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతరం వారిని జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువతులు చేస్తున్న ఈ పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ కారణంగా నిజాయితీగా స్వచ్చంధ సంస్థల పేరుతో వచ్చేవారికి కూడా ఎవరూ డబ్బులు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల‌ను క‌టింన‌గా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి వారి సంఖ్య మరింత పెరిగి నిజాయితీగా స్వంచ్ఛంధ సంస్థ‌ల కోసం ప‌ని చేసేవారికి కూడా ఎవ‌రూ విరాళాలు ఇవ్వ‌ని ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: