ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డికీ ఎదురైనా అనుభవం ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురైంది. ప్రాంతాలు వేరు అయినప్పటికీ సీన్ మాత్రం ఒకేలా ఉంది. రాజకీయాల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఎపిసోడ్ మాత్రం సీన్ టు సీన్ రివర్స్ అయ్యింది. 2017 లో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వైయస్ జగన్ కు ఎదురైన అనుభవమే 2021 లో చంద్రబాబుకు ఎదురయ్యింది. దీంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.


 విషయంలోకి వెళితే మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అంటూ చిత్తూరులో నిరసన తెలిపేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తిరుపతిలోని రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబు ను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలో పర్యటించేందుకు అనుమతి లేదని కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్ అమలులో దృశ్య  అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.


 పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లాంచ్ లోనే  చంద్రబాబు నేలపై కూర్చున్నారు. పోలీసులు ఎంత బతిమిలాడినా చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అంతేకాదు దండం పెడుతూ బ్రతిమలాడినా బాబు మాత్రం నిరసన కొనసాగించారు. ఈ దౌర్జన్యము ఏమిటి అని పోలీసులు ప్రశ్నించాడు. నేను ఏమైనా హత్య చేయడానికి వెళుతున్న అంటూ వారిని ప్రశ్నించారు. చిత్తూరు వెళ్లి తీరుతాను ఎవరు వచ్చి ఆపుతాడో చూస్తాను అంటూ సవాల్ విసిరారు. అయితే పోలీసులు చంద్రబాబును ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.


 2017 లో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే ఏడాది జనవరి 26న ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విశాఖ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన క్యాండిల్ ర్యాలీ హాజరయ్యేందుకు వెళ్లారు. అయితే జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ ఎయిర్ పోర్టు లోనే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. రన్ వైపే ఫ్లైట్ దిగిన వెంటనే పోలీసులు చుట్టుముట్టడంతో ఆగ్రహంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. జగన్ తో పాటు ఇతర నేతలంతా ఏర్పాటులో నిరసనకు దిగారు. కనీసం ఎయిర్పోర్ట్ లాంజ్ లోనికి కూడా అనుమతించకపోవడం తీవ్ర దుమారం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: