తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. ఆయా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. రెండు స్థానాల కోసం టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్  కమిటీ ని ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారకర్తలు సమన్వయకర్త లను తెలంగాణ నియమించింది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్, పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ప్రచార కర్తగా రేవంత్ రెడ్డి, ఏ ఐసీసీ కార్యదర్శి సంపత్ ను నియమించారు.                                               



ఖమ్మం నల్లగొండ  వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యకర్తగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సమన్వయ కర్తగా కాంగ్రెస్ ఆదివాసి కమిటీ జాతీయ వైయస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ను నియమించారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు రవి వాణి దేవి బరిలోకి దిగారు.ఇక ఇదే స్థానం కోసం కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్ర రావు, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీపడుతున్నారు.


 ఖమ్మం, వరంగల్,  నల్లగొండ , గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం లో టిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, ఈజ్ ఏ ఎస్ నుంచి కోదండరాంతో పాటు విజయసారథి డీజే తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి, రాణి రుద్రమదేవి పోటీ పడుతున్నారు. బాగా తెలంగాణలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 16 నోటిఫికేషన్ విడుదల అయింది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లు స్వీకరించి ఫిబ్రవరి 24న నామినేషన్లు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26న ముగిసింది. మార్చి 14న ఉదయం ఏమి నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని మార్చి 17న ఫలితాలను ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: