సాధారణంగా స్కూల్ కి లేటుగా వస్తే కఠిన శిక్షలు విధిస్తుంటారు. ఇక స్కూల్ లో చదుకునేటప్పుడు చాలా కఠిన నిబంధలు పెడుతుంటారు యాజమాన్యం. ప్రైవేటు స్కూళ్లలో అయితే ఇలాంటి శిక్షల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫీజులు టైంకు తప్పకుండా కడుతున్నట్టే.. సమయానికి స్కూలకు వెళ్లాల్సిందే.. నిమిషం ఆలస్యమైనే అంతే సంగతులు. పాఠశాలకు టీచర్లు సమయానికి వచ్చినా రాకపోయినా.. విద్యార్థులు మాత్రం గంట కొట్టేసరికి  స్కూళ్లో ఉండాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేస్తారు ఉపాధ్యాయులు. పొరపాటున ఒక విద్యార్థి ఆలస్యంగా వస్తే కొంతమంది టీచర్లు కన్నెర్ర చేస్తారు. మరికొందరు అయితే బెత్తానికి పనికి చెబుతారు. శిక్షలందు ఈ శిక్షలు వేరయా అనేలా ఒక్కో స్కూళ్లో ఒక్కో విధంగా ఉంటాయి.

అయితే అక్కడ టీచర్లకు కూడా అదే రూల్ ఉంటుంది. ప్రభుత్వం పాఠశాలల్లో కొన్ని చోట్ల ఇలాంటి నిబంధనలు ఏవీ పెద్దగా కనిపించవు. కానీ ఇప్పుడిప్పుడు చాలావరకు ప్రభుత్వం పాఠశాలల్లోనూ టైంకు తప్పని సరి రావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రార్ధనా సమయానికి విద్యార్థులు అంతా తప్పక ఉండాల్సిందే అంటున్నారు. లేదంటే గేట్లు వేసేస్తున్నారు.

ఒకవేళ విద్యార్థులు ఆలస్యంగా వస్తే కాసేపు బయట నిలబెట్టడమో.. లేదో పేరంట్స్ తో మరుచటి రోజు సంతకాలు పెట్టించుకుని రావడమో.. గుంజీలు తీయించడం.. కాసేప గోడ కుర్చీలు వేయించడం. లేదంటే మరికొన్ని చిన్న చిన్న శిక్షలు వేస్తుంటారు. ఇది సాధరాణంగా అన్ని చోట్లా ఉండేవే.  కానీ గుడివాడలో మాత్రో ఓ పీఈటీ ఇచ్చిన శిక్ష అమ్మ బాబోయ్ అనేలా చేస్తున్నాయి.. స్కూళుకు ఆలస్యంగా వెళ్లడం కాన్నా సెలవు పెట్టేయడం బెటర్ అంటున్నారు విద్యార్థులు.

ఇక పాఠశాలకు ఆలస్యంగా వెళ్తున్నారని విద్యార్థుల పట్ల పీఈటీ ఉపాధ్యాయుడు మడక ప్రసాద్ చాలా కఠినంగా వ్యవహరించారు. స్కూలు ఆవరణలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులందర్నీ మోకాళ్లపై .. అది ఎండలో నడిపించారు. ఈ ఘటన గుడివాడ ఎస్.పి.ఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఎప్పటినుంచో ఇలాంటి శిక్షలు అమలు అవుతున్నా.. ఇంతకాలం బయటకు తెలియలేదు. ఇప్పుడు ఓ విద్యార్ధి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పీఈటీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: