బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై ఏపీ ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా ఫిర్యాదు చేసిన వారిలో పలువురికి రీ నామినేషన్లు మళ్ళీ వేసుకునే అవకాశం కల్పించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్లు వేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన ఉంటుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించింది ఎస్ఈసీ. ఆదేసలలో తిరుపతిలో 2, 8, 10, 21, 41, 45 వార్డుల్లో రీ నామినేషన్లకు అవకాశం ఇచ్చింది. పుంగనూరులో 9, 14, 28 వార్డుల్లో రీ నామినేషన్లకు వెసులుబాటు కల్పించింది. రాయ చోటిలో 20, 31 వార్డుల్లో.. ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డుల్లో ముగ్గురి అభ్యర్థిత్వాలు పునరుద్ధరణ చేసింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో రాయచోటి, తిరుపతిలో మరోసారి నామినేషన్‌ దాఖలు చేయడానికి ఎస్‌ఈసీ అనుమతించడాన్ని సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్ దాఖలైంది. ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను విచారించనుంది ధర్మాసనం. 

ఇకే రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు నామినేషన్లు దాఖలు చేసేందుకు వైసిపి పన్నిన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే రాయదుర్గం మున్సిపాలిటీ లో 23వ వార్డులో టిడిపి తరఫున ఎర్రమ్మ అలాగే వైసీపీ తరఫున పద్మజ బరిలో ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వైసిపి అభ్యర్థి భర్త ఒక అనుకోని కేసులో చిక్కుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే తన భర్తను కేసు నుంచి తప్పించుకు పోవడంతో పద్మజ అధికార పార్టీ మీద అలిగింది. చాలా రోజుల నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమెకు ఇక లాభం లేదని భావించిన వైసీపీ నేతలు ఆ వార్డు నుంచి వైసీపీ తరఫున మరో నామినేషన్ వేయించేందుకు సిద్ధమయ్యారు. భయపెట్టి తమను అప్పట్లో నామినేషన్లు వేయకుండా చేశారని చెబుతూ ఫిర్యాదు చేస్తే అప్పుడు అలాంటి వారికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పింస్తుందని భావించి రాష్ట్ర ఎన్నికల సంఘంకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల మీద దౌర్జన్యానికి పాల్పడటంతో అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు తేల్చాలని ఎన్నికల సంఘం తో పాటు కలెక్టర్ కూడా స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పోలీసులు అలాంటిదేమీ జరగలేదని తెలుసుకుని ఇది తప్పుడు ఫిర్యాదు అని తేల్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: