భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైద్యాధికారులు, నిపుణులు పేర్కొన‌క‌పోయినా సెకండ్ వేవ్‌గానే జ‌నాలు భావిస్తున్నారు. రాష్ట్రాల్లో వంద‌ల్లో నుంచి కేసులు మ‌ళ్లీ వేల‌ల్లోకి చేరుకుంటుండ‌టంతో ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. మొద‌టి మ‌హ‌రాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడులోనే కేసులు పెరిగినా ఇప్పుడు మ‌రికొన్ని రాష్ట్రాల్లో అలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. దేశ వ్యాప్తంగా న‌మోద‌వుతున్న మొత్తం కేసుల్లో ఆరు రాష్ట్రాల్లోనే 88శాతం కేసులు ఉండ‌టం విశేషం. రోజువారీ కేసుల్లో ఆరు రాష్ట్రాల  వాటా 87.25 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ పేర్కొంది. కేసులు అధికంగా నమోదవుతున్న వాటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలు ఉన్నాయి.


 అత్య‌ధికంగా  మహారాష్ట్రలో(8293), కేరళ(3,254) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు క్రితం రోజుతో పోల్చితే గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 15,510 కొత్త కేసులు రాగా.. మరో 106మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య కోటీ 11 లక్షల 12వేల 241కి, మరణాల సంఖ్య 1,57,157కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,68,627 క్రియాశీల(యాక్టివ్‌) కేసులు ఉన్నాయి. వీటిలో అయిదు రాష్ట్రాల్లోనే 84 శాతం క్రియాశీల కేసులు ఉన్నట్లు హెల్త్ బులిటెన్ ఆధారంగా తెలుస్తోంది. మహారాష్ట్రలో46.39%, కేరళలో 29.49% యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వాలు యోచిస్తున్నాయి.



ఇప్ప‌టికే మ‌హారాష్ట్రలో  కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి, అచల్‌పూర్‌లలో లాక్‌డౌన్‌ను మార్చి 8వ తేదీ వరకు పొడిగించింది అక్కడ ప్రభుత్వం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇక దేశంలో కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.  మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి ఒక్కరికి మాస్కు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మాస్కులేని వారికి జరిమనా విధిస్తున్నారు. కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇక మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: