ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది మంత్రుల కారణంగా ముఖ్యమంత్రి జగన్ ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్ విషయంలో కొంత మంది మంత్రులలో ఆగ్రహం పెరుగుతుందనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాట విని తమ మాట లెక్క చేయడం లేదు అనే భావనలో కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు సీనియర్ మంత్రులు ఉన్నారనే భావన వైసిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరి మాట కూడా వినే ప్రయత్నం చేసేవారు. ఈ నేపథ్యంలోనే ఆయన అందరికీ సహకరించడం మనం చూసే వాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి పెద్దగా కనబడటంలేదు. కొంతమంది పదవుల్లో ఉన్న నేతల మాట ముఖ్యమంత్రి జగన్ వినడంలేదు. దీంతో కొంతమంది మంత్రులలో అసహనం పెరిగిపోతోంది. సలహాదారుల పేరుతో కొంత మంది ప్రభుత్వ పెద్దలుగా పెత్తనం చెలాయించడంతో ఎమ్మెల్యేలు గానీ మంత్రుల్ని గానీ పెద్దగా జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేయడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

కొంతమందితో ముఖ్యమంత్రి జగన్ సన్నిహితంగా ఉండటం మరికొంతమందిని పక్కన పెట్టడం వంటివి జరుగుతున్నాయి. ఎంపీలలో కూడా ఆగ్రహం ఎక్కువగానే ఉంది అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎంపీలు చాలా మంది వైసీపీ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత మంది ఎంపీలు స్వయంగా జోక్యం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాసరే పెద్దగా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా పార్టీ కోసం పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ వారిని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడంలేదు. పార్టీలో ఇప్పుడు అసంతృప్తి వర్గాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయని కొంత మంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టే పరిస్థితి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: