అవును మీరు విన్న‌ది నిజ‌మే..! చ‌త్తీస్‌గ‌డ్‌లో పేడ దొంగ‌త‌నం జ‌ర‌గ‌కుండా ఏకంగా సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. చ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలో పేడ‌కు భారీగా డిమాండ్ ఉండ‌టంతో ఈ న‌యా ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్థిక‌ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్ర ప్ర‌భుత్వం 2020లో గౌ-దాన్‌ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి   గౌ-దాన్‌ న్యాయ యోజనగా పేరు పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు, గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారుచేసిన ప్రమిదలు సరఫరా చేయాల్సిందిగా  గౌ-దాన్‌ న్యాయ యోజన  పిలుపునిస్తోంది.


ఈ ప‌థ‌కం కింద కిలో ఆవు పేడను రూ.2కి కొనుగోలు చేస్తామని పేర్కొంది. అప్పటి నుంచి ఆవు పేడకు విపరీతమైన డిమాండ్‌. పలితంగా దొంగతనాలూ పెరిగాయి. తాజాగా అంబికాపుర్‌ మున్సిపాల్టీలో స్థానిక ప్రభుత్వ గౌ-దాన్‌ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వరుస దొంగతనాలతో కలవరపడుతున్న అధికారులు గౌ-దాన్‌ కేంద్రాల దగ్గర సీసీటీవీ కెమెరాలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని కూడా నియమించాలన్న యోచనలో ఉన్నారు.


పేడకు డిమాండ్ పెరగడంతో దొంగతనాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. దీంతో పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు, గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారుచేసిన ప్రమిదలు సరఫరా చేయాల్సిందిగా  రాష్ట్రీయ కామధేను ఆయోగ్ పిలుపునిస్తోంది. ఇటువంటి పథకం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని, గో సంతతి వృద్ధితో పాటు వాటిపై ఆధారపడే వారికి ఆర్ధిక చేయూతనివ్వడం కూడా  రాష్ట్రీయ కామధేను ఆయోగ్ లక్ష్యాల్లో ఒకటి అని సంస్థ అధ్యక్షులు వల్లభ్ కటారియా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: