సాధారణంగా ఎవరైనా భోజనం చేసినప్పుడు భోజనంలో ఎన్నో రకాల కూరలు ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. అదే సమయంలో భోజనం పూర్తయిన తరువాత చివర్లో పెరుగు ఉండాలని కూడా అనుకుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే భోజనం లో ఎన్ని రకాల రుచికరమైన కూరలు ఉన్నప్పటికీ చివరిలో పెరుగు లేదు అంటే ఇక ఆ భోజనం సంతృప్తికరంగా ఉండదు అన్న విషయంతెలిసిందే. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ భోజనంలో తప్పనిసరిగా పెరుగును పెట్టుకుంటారు.


 చివర్లో పెరుగుతో  రెండు ముద్దలు తిన్నా కూడా ఎంతో సంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అయితే ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ రోజువారీ భోజనంలో పెరుగును ఒక భాగం చేసుకున్నారు. అయితే భోజనం కోసం  తయారు చేసిన అన్ని రకాల కూరలతో భోజనం చేస్తారో లేదో తెలియదు కానీ ఇక చివర్లో పెరుగుతో మాత్రం తప్పనిసరిగా భోజనం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు.  చివర్లో పెరుగు తింటే నే భోజనం సంతృప్తిగా పూర్తయినట్లు భావిస్తూ వుంటారు చాలామంది. అయితే కేవలం భోజనాన్ని సంతృప్తికరంగా మార్చడానికి మాత్రమే కాదు పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు.



 ప్రతిరోజూ పెరుగుతో ఆహారం తినడం వల్ల త్వరగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇక ఇప్పుడు నిపుణులు కూడా ఇది నిజమే అని అంటున్నారు. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ జీర్ణ ప్రక్రియను బ్యాలెన్స్  చేస్తూ ఉంటుంది అంటూ చెబుతున్నారు నిపుణులు. పెరుగు లస్సీ మజ్జిగ లాంటి వాటివల్ల గ్యాస్ ఉబ్బరం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయట.. పెరుగు  లోని పలు రకాల బ్యాక్టీరియాలు పేగుల్లోని మైక్రోఫ్లోరాను మెరుగుపరచడం కారణంగా జీర్ణ ప్రక్రియ ఎంతగానో మెరుగ్గా సాగుతుంది అని చెబుతున్నారు. అందుకే ప్రతి రోజూ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: