ప్రస్తుతం మార్కెట్లో రోజురోజుకు ఎన్నో రకాల కొత్త మొబైల్స్ వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. అధునాతనమైన ఫీచర్లతో ఆకర్షిస్తూ తమ మార్కెట్ పెంచుకునేందుకు అన్ని మొబైల్ తయారీ సంస్థలు సిద్ధమవుతున్నాయి.  అయితే మార్కెట్లో కి ఎన్ని కొత్త బ్రాండ్ లతో  మొబైల్ తో వచ్చినప్పటి ఎంతో అధునాతనమైన ఫీచర్లు అందించినప్పటికీ తక్కువ ధరకే మొబైల్స్ అందుబాటులోకి ఉంచినప్పటికీ యాపిల్ ఫోన్ రేంజ్ మాత్రం ఎప్పటికి తగ్గదు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొబైల్ రంగంలో దిగ్గజ మొబైల్ గా  కొనసాగుతుంది యాపిల్.  ఇక మొబైల్ వినియోగదారులు అందరూ యాపిల్ తమ దగ్గర ఉంది అంటే అది ఒక గౌరవం గా ఫీల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఈ మధ్య కాలంలో అటు యాపిల్ కూడా మొబైల్ రంగంలో ఉన్న పోటీని తట్టుకుంటూ ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త మొబైళ్లను మార్కెట్లోకి తీసుకు వస్తుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ప్రస్తుతం ఐఫోన్ మ్యాక్స్ ప్రో మార్కెట్లో అంతకంతకూ డిమాండ్ సాధిస్తూ దూసుకుపోతుంది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో మంది కేటుగాళ్లు అక్రమంగా ఈ ఐఫోన్ లను తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నారు.  కాగా ఇటీవలే బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారులు వేగంగా 2.8 కోట్ల విలువ చేసే ఐఫోన్ లను  స్వాధీనం చేసుకున్నారు.



 అమెరికా పాస్పోర్ట్ కలిగిన భారతీయ దంపతులు పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా భారీగా ఐఫోన్ లను  తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా 206 ఐఫోన్ లు  బయటపడ్డాయి. దీంతో వీటిని సీజ్  చేసిన అధికారులు వీటి విలువ 2.8 కోట్లు ఉంటుందని తేల్చారు. అయితే అక్రమంగా ఐ ఫోన్ లు  తరలిస్తున్న వారు ప్యారిస్ నుంచి బెంగళూరు వచ్చినట్లు తెలుస్తోంది. వారి లాగేజీ  తనిఖీ చేయగా 206 ఐఫోన్లు బయటపడ్డాయి దీనికి సంబంధించిన బిల్లు పేపర్లు చూపించక పోవడంతో వీటిని సీజ్ చేసిన అధికారులు ఇద్దరు దంపతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇలా ఐఫోన్లు బయటకు రావడంతో మరింత నిఘా పెంచారు కస్టమ్స్ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: