ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల పై గుదిబండలా మారిపోతున్నాయి  అన్న విషయం తెలిసిందే.  కరోనా  వైరస్ కారణంగా ఆర్థికంగా చితికిపోయి ఎంతో అవస్థలు పడుతున్న జనాలు ఇప్పుడిప్పుడే కాస్త ఉపాధి కొరకు ఉపశమనం పొందుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం నిత్యావసరాల ధరలు  భారీ రేంజ్లో పెంచుతూ ఉండడంతో ఇక సామాన్య ప్రజలు అందరి పై పెరుగుతున్న ధరలు గుదిబండలా మారి పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెరిగగా.. ఇక ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్య ప్రజలు మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇప్పుడిప్పుడే ఆర్థిక సమస్యల నుంచి బయట పడుతున్న సామాన్య ప్రజలు ఇక ఇప్పుడు భారీగా పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నారు.  పెట్రోల్ వంటగ్యాస్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.  అయితే పెట్రోల్ వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగిపోవడంతో బెంబేలెత్తిపోతున్నారు జనాలు. ఇక అటు వాహనం బయటకు తీయాలంటే భయపడిపోతున్నారు మరోవైపు వంటగ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడం ఖాతాల్లోకి వస్తున్న సబ్సిడీ తగ్గిపోతూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే పెరిగిపోయిన ధరలతో ఇబ్బందికరమైన జీవితాన్ని గడుపుతున్న సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు మరోసారి ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



 అయితే ఈసారి నిత్యావసరాల పై కాకుండా పంట ఎరువులు వంతు వచ్చింది.  ఎరువులు 100 నుంచి 250 రూపాయల వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని సంస్థలు ఎరువుల ధరలు పెంచగా మరికొన్ని సంస్థలు ఏప్రిల్ 1 నుంచి ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎరువుల ధరలు భారీగా పెంచేందుకు ఆయా ఎరువుల తయారీ కంపెనీలు సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటు వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇక ఇప్పుడు పెరిగిన ధరలు మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: