తెలంగాణ రాష్ట్ర స‌మితి సంస్థాగ‌త పార్టీ నిర్మాణంపై వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫుల్‌గా ఫోక‌స్ పెట్టారు. నియోజ‌క‌వర్గాల వారీగా 50వేల నుంచి 1ల‌క్ష‌లోపు పార్టీ స‌భ్య‌త్వాల‌ను చేసేవిధంగా ఎమ్మెల్యేల‌కు, స్థానిక నాయ‌కుల‌కు ల‌క్ష్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్ప‌టికే చాలామట్టుకు ల‌క్ష్యాలు పూర్తి కావ‌డం గ‌మ‌నార్హం. గ్రామీణ స్థాయిలో కూడా పార్టీకి బ‌ల‌మైన పునాదులు ప‌డాల‌నే ఉద్దేశంతోనే కేటీఆర్ స‌భ్య‌త్వాల న‌మోదుపై ఎక్కువ‌గా శ్ర‌ద్ధ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యేలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అధిష్టానం సూచన ప్రకారం ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సభ్యత్వాలు నమోదు చేయించాల్సి ఉండగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యం పూర్తి చేశారు.


సుమారు 70 లక్షలకు పార్టీ సభ్యత్వం చేరిందని సోమ‌వారం నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో కేటీఆర్ వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పార్టీ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. ఈ నెలాఖరు వరకు టిఆర్ఎస్ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ సభ్యత్వాల నమోదు చురుగ్గా కొనసాగుతోందని..ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50 వేల నుంచి సుమారు లక్ష వరకు సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.


వాస్త‌వానికి గ‌తంలో స‌భ్య‌త్వాల న‌మోదుకు పెద్ద‌గా హ‌డావుడి క‌నిపించ‌క‌పోయేది. సభ్యత్వ నమోదును నామమాత్రంగా నడిపించిన పార్టీలు.. ఇప్పుడు పోటాపోటీగా మెంబర్షిప్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రమాద బీమా కల్పిస్తమంటూ, కేవలం సెల్ఫోన్ నుంచి మిస్స్డ్ కాల్ ఇస్తే చాలంటూ సభ్యత్వ నమోదు కోసం జనం వెంటపడుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ భారీగా సభ్యత్వాల నమోదుపై ఫోకస్ పెట్టాయి. వరుసగా అన్ని స్థాయిల ఎన్నికలు ముగియడం, చివరిగా మున్సిపల్ ఎలక్షన్లు వస్తుండటంతో పార్టీలను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. గతంలో కంటే మెంబర్షిప్ను పెంచుకోవాలని, 80 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: