ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. పార్టీల మధ్య పంచాయితీ మాత్రం ఆగడం లేదు. పార్టీ గుర్తలకు సంబంధం లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికలపై పార్టీలో న్యాయస్థానాల్లో పోరాడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంపై నమోదైన కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మానసం ఆగ్రహం వ్యక్తం చేసింది.

పంచాయతీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ  మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కె.శివరాజశేఖరరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా శివరాజశేఖరరెడ్డి తరపున న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని టీడీపీని ఎస్‌ఈసీ సూచించింది తప్పితే ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

కేసు విచారణలో భాగంగా స్పందించిన న్యాయస్థానం పార్టీ ప్రధాన కార్యదర్శి మేనిఫెస్టో విడుదల చేస్తే అధినేతపై చర్యలు కోరడం ఏంటని ప్రశ్నించింది. చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పిల్‌కు విచారణార్హత లేదంటూ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

   ఆంధ్రప్రదేశ్ లోని 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 9, 14, 17. 21 తేదీల్లో పోలింగ్ జరగగా.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపుపైనా పార్టీల మధ్య యుద్ధం నడిచింది. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 80 శాతానికి పైగా పంచాయతీల్లో గెలిచారని వైసీపీ ప్రకటించుకోగా.. 42 శాతం మంది తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచారని టీడీపీ తెలిపింది. జనసేన కూడా తాము 25 శాతం ఓట్లు సాధించామని వెల్లడించింది.దీంతో అధికార పార్టీ తమ పార్టీ మద్దతుతో  గెలిచిన  అభ్యర్థుల వివరాలతో వెబ్ సైట్ రూపొందించింది. అయితే టీడీపీ మాత్రం తమ మద్దతుతో గెలిచిన వారిని.. వైసీపీ బెదిరించి తమ పార్టీలో చేర్చుకుందని ఆరోపిస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: