ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో ఎన్నిల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ పార్టీల్లో హ‌డావుడి ఎక్కువ‌వుతోంది. అంతే స్థాయిలో వ్యూహాలు, పార్టీల ఎత్తులు పై ఎత్తులు కూడా క‌నిపిస్తున్నాయి. ఎలాగైనా రాష్ట్రంలో అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్‌.. ఎలాగైనా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవాల‌ని బీజేపీ తీవ్రంగా య‌త్నిస్తున్నాయి. బీజేపీ తరుపున హోం మంత్రి అమిత్‌షానే నేరుగా రంగంలోకి దిగారు. ప్ర‌చార స‌భ‌ల‌తో.. పార్టీలోకి తృణ‌మూల్‌ను లాగేసుకోవ‌డంలో కీల‌క పాత్ర వ‌హిస్తున్న‌ర‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా బీజేపీని త‌ట్టుకోవ‌డానికి తృణ‌మూల్ కూడా అంతే స్థాయిలో బ‌లం స‌మ‌కూర్చుకుంటోంది. పొత్తుల‌ను తెర‌పైకి తెస్తోంది.  


ఈక్ర‌మంలోనే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో మరో కూటమి తెరపైకి వచ్చింది. రానున్న ఎన్నికల్లో టీఎంసీతో జతకట్టేందుకు ఆర్‌జేడీ సిద్ధమయింది. అసెంబ్లీ ఎన్నికల్లో దీదీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. మమతా బెనర్జీని ..తేజస్వి యాదవ్ రాష్ట్ర సెక్రటేరియట్‌లో కలుసుకుని మంతనాలు సాగించారు.ఆర్జేడీ నేత అబ్దుల్ బారి సిద్ధిఖి సారథ్యంలోని పార్టీ ప్రతినిధి బృందం టీఎంసీ సీనియర్ నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పలు రౌండ్లు చర్చలు జరిపింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీని ఓడించడమే ఆర్జేడీ ధ్యేయమని తేజస్వి యాదవ్ వెల్లడించారు. ఈమేరకు దీదీతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు.


భేటీ అనంర‌తం తేజ‌స్వీ యాద‌వ్ మాట్లాడుతూ బీహార్ లో మాత్రమే తమ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ మమత దీదీతో కలిసి బీజేపీపై పోరాడుతామని ఆతరువాత ఆయన చెప్పారు. సీట్ల పంపిణీ అంశం ఇంకా తమ తమ మధ్య ప్రస్తావనకు రాలేదన్నారు. బెంగాల్ లో హిందీ మాట్లాడే ప్రజలు చాలామంది ఉన్నారని, సీఎం మమతకు మద్దతు ఇవ్వాలని వీరిని  కోరుతానని పేర్కొన్నారు. అలాగే తమ తండ్రి prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఆర్జేడీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి  సపోర్ట్ ఇవ్వాలని తెలిపిన‌ట్లుగా స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి కొద్దిరోజుల్లో పొత్తుపై పూర్తి స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: