ఆంధ్ర ప్రదేశ్ లో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఎన్నికలు మార్చి రెండో వారంలో జరగనున్నాయి. ఈ మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ ఉపసంహరణ చేసుకోనున్నారు. చిత్తూరు జిల్లాలో నేడు నామినేషన్ల ఉపసంహరణ జరగనున్నాయి.. జిల్లాలో రెండు కార్పొరేషన్లు, అయిదు పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ప్రారంభం కానుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను వెలువరించనున్నారు. గతేడాది మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు ఆయా నగర, పురపాలక సంస్థల్లో నామపత్రాలు స్వీకరించారు.


14 న పరిశీలించారు. 15 న ఎన్నికలు జరగనున్నాయి. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే..గతేడాది మార్చిలో ఎక్కడ ఆగాయో, అక్కడి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రకటించారు. గతనెల 15న ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనేపథ్యంలో పురపాలిక ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను పలువురు అధికారులకు జిల్లా యంత్రాంగం అప్పగించింది. తిరుపతి నగరపాలక సంస్థకు కలెక్టర్‌ హరినారాయణన్‌, చిత్తూరు కార్పొరేషన్‌, పలమనేరు పురపాలక ఎన్నికలకు జేసీ మార్కండేయులు, మదనపల్లె, పుంగనూరుకు జేసీ వీరబ్రహ్మం, నగరి, పుత్తూరుకు జేసీ రాజశేఖర్‌ను నియమించారు.


నామినేషన్ల ఉపసంహరణకుగాను మదనపల్లె 12 చిత్తూరు కార్పొరేషన్‌లో 11, పుంగనూరులో 10, పలమనేరు, పుత్తూరులో 7 , నగరి మున్సిపాలిటీలో 3. తిరుపతి  మొత్తం 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే మరి కొద్ది సేపటి లో నియమించిన కేంద్రాలలో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు కు ఎదురైన ఘటన వల్ల టీడీపీ నేతలు చాలా వరకు ఉపసంహరణ చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు టీడీపీ నేతల అరెస్టులు కూడా టీడీపీ శ్రేణులను బలహీన పరుస్తున్నాయి. ఎంత మంది ఎన్నికల బరిలో నిలుస్తారు? ఎంత నామినేషన్లు వెనక్కి తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: