మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి రానుంది. అయితే ఈ పురు పోరు ప్ర‌చారం భారీగా సాగుతున్న వేళ ఈసీ అభ్య‌ర్థుల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే నేటి నుంచి ప్రచారానికి ఐదుగరిని మాత్రమే అనుమతి ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర్వులు కూడా నిన్న నిమ్మగడ్డ జారీ చేశారు. ఏ అభ్య‌ర్థి ఎన్నిక‌ల ప్ర‌చారంలో అయినా ఐదుగురు మించి ఉంటే అది కూడా ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌నే అవుతుందని ఈ విష‌యంలో ఎవ్వ‌రిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని...ఈరోజు నుండి గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్,ఎస్పీ,సీపీ లకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. 

ఇక డబ్బు,మద్యం పై ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు చేయాల‌ని ఆయన పేర్కోన్నారు. కోడ్ ఉల్లంగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామ‌ని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అయితే ఈ ఆదేశాలు ఎంతవరకు అమలు అవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒక పక్క అధికార పార్టీ వారు రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. కేవలం ఆంక్షలు ప్రతిపక్షాలకు మాత్రమే విధిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకునే ప్రక్రియకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ శ్రీకారం చుట్టారు.

దీంట్లో భాగంగా వివిధ  జిల్లాల్లో రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ భేటీ కూడా వాడీ వేడీగా జరిగింది. ఎస్‌ఈసీ అనుసరిస్తున్న తీరు సరిగా లేదంటూ సమావేశంలోనే మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాల్లో ఎస్‌ఈసీ తీరు చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయని ఎస్‌ఈసీ ముఖం మీద చెప్పేశాయి అన్ని పార్టీలు. మరి ఈ నేపధ్యంలో ఇక ఆంక్షలు ఎలా ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: