మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు సొంత నియోజ‌క‌వర్గం మైల‌వ‌రంలో దిమ్మ‌తిరిగి పోయే షాక్ త‌గిలింది. ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద టీడీపీకి కేవ‌లం ఆరు పంచాయ‌తీల‌తో స‌రిపెట్టుకుంది. అది కూడా పార్టీ నేత‌ల మ‌ధ్య ఐనైక్య‌త‌తోనే అవి అయినా వైసీపీ నుంచి చేజారాయి. ఇక తాజాగా నియోజ‌క‌వ‌ర్గానికి గుండెకాయ‌గా ఉన్న గొల్ల‌పూడిలో ఉమాకు చెప్పుకోలేని ప‌రాభ‌వం ఎదురైంది. నియోజకవర్గంలో గొల్లపూడి అతి పెద్ద గ్రామం. ఒక్క గ్రామంలోనే 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉండేది ఇక్కడే.

ఇక్కడ నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్య‌ర్థులుగా ఉన్న న‌లుగురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ చెంత చేరిపోయారు. గొల్లపూడి 1, 3, 5, 8 సెగ్మెంట్‌ అభ్యర్థులు చెరుకుమల్లి నరేంద్ర, దాఖర్ల కిషోర్‌బాబు, యడవల్లి శారమ్మ, పిళ్లా శివ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సమక్షంలో వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అటు ఎమ్మెల్యే కేపీతో పాటు త‌ల‌శిల ర‌ఘురాం ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు.

ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ముందున్న తలశిల రఘురాం తన సొంత గ్రామంలో పేదలకు 3,648 ఇళ్ల పట్టాలను ఇచ్చి పాదయాత్ర కాలనీలను నిర్మించేలా పేదలకు మేలు చేశారు. దీంతో గొల్లపూడిలో రాజకీయం మొత్తం మారిపోయింది. ఒకప్పుడు మాజీ మంత్రి ఉమాకు కంచుకోటగా ఉన్న గొల్ల‌పూడిలో ఇప్పుడు సీన్ అంతా పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. ఏదేమైనా వైసీపీని.. సీఎం జ‌గ‌న్‌ను ప‌దే ప‌దే ప్రెస్ మీట్లు పెట్టి టార్గెట్ చేసే ఉమాకు ఈ స్థాయిలో దెబ్బ ప‌డిపోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: