కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అవి మంచివి కాదు అని తెలిసిన వాటిని మార్చుకోలేకపోతారు. అలాంటిదే కాళ్ళు ఊపడం.మీరు గమనిస్తారో లేదో కానీ చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. అలా సరదాగా కుర్చీలో కూర్చున్నా లేదా ఏదైనా పనిలో ఉన్న చాలా మంది కాళ్ళు ఉపుతుంటారు.పెద్దవాళ్ళ ముందు కాళ్ళు ఊపితే వారు వెంటనే అలా ఊపకూడదు అని చెప్తుంటారు.

ఇక పిల్లలు ఏదైనా ఎతైన ప్రదేశంలో కూర్చుని కాళ్ళు ఊపుతుంటే వారి తల్లిదండ్రులకు ఆర్ధిక ఇబ్బందులు లేదా అప్పుల్లో కూరుకుంటారు అని చెప్పేవారు. కాళ్ళు ఊపడానికి, తల్లిదండ్రులు అప్పులపాలు అవ్వడానికి సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? చాలా చిన్న సంబంధం ఉంది. అదేమిటంటే పిల్లలు అలా కాళ్ళు ఊపితే వారి శరీరంలోని  శక్తీ తగ్గిపోతుంది  అలాగే  వారి మోకాళ్ళల్లోని పట్టు తగ్గిపోవడం వలన వారికి ఆరోగ్య సమస్య వస్తుంది. సాధారణంగా పిల్లలకి ఏదైనా అనారోగ్యం ఏర్పడితే తల్లిదండ్రులకు కచ్చితంగా అది భారమే కదా ! పేద కుటుంబాలలో అయితే వారి చికిత్స నిమిత్తం అప్పు చేయవలసి ఉంటుంది. కాబట్టి అలా అనేవారు. నిజానికి వారు ఇలా అనడం వెనుక మరొక కారణం ఉంది.

అయితే పూర్వకాలంలో ఔషధాలను, నూనె ఉన్న పాత్రలను, డబ్బులు దాచే పెట్టెలను, కిళ్ళీ వేసుకునే అలవాటు ఉంటే ఆ డబ్బాలను ఇంట్లో పెద్దవాళ్ళు అనగా నానమ్మ, తాతయ్య ల మంచాల కింద ఉంచేవారు. ఒక వేళ పిల్లలకు మంచం మీద కూర్చుని కాళ్ళు ఊపే అలవాటూ ఉంటే వారి కాళ్ళు ఆ పెట్టెలకు తగిలి అన్నీ వోలిగిపోయి పడిపోతాయి అని పిల్లలకు అలా చెప్పేవారు. ఇంట్లో  పెద్దల మాట వినని పిల్లలు ఉంటే వారు కాళ్ళు ఊపి వాటిని పగలకొడుతూ ఉండేవారు. తద్వారా ఈ ధన నష్టం వారి కుటుంబం మీద పడేది. కాబట్టి కుటుంబ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అలా కాళ్ళు ఊపకూడదు అని చెప్పేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: