గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని.. ఎన్నికలు మొత్తం పోలీసుల కనుసన్నల్లోనే సాగుతున్నాయని ఫైర్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 5న చేపట్టిన బంద్ ను జయప్రదం చేయాలని ఆయన అనంతపురంలో విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేత, ఎమ్మెల్సీ బిటి నాయుడు తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. విశాఖ ఉక్కుపై రాష్ట్ర బీజేపీ నేతలు కనీసం కేంద్ర పెద్దలను కలిసే పరిస్థితుల్లో కూడా లేరని రామకృష్ణ మండిపడ్డారు. 

వారంతా స్వామీజీల తో డీల్ చేసుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పోలీసులు, వాలంటీర్ల బెదిరింపులు, డబ్బుల ప్రలోభాలతో సాగుతున్నాయని అన్నారు. విశాఖ ఉక్కు కోసం ఆత్మబలిదానాలు జరిగాయని ఇలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బిజెపి నేతలు ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రి అపోయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, మంత్రులు రాష్ట్ర బీజేపీ నేతలకు క్లాస్ పీకారని అన్నారు.

 నరేంద్ర మోదీ స్పష్టమైన లక్షల భూమిని కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్నికలలో ఎవరు నామినేషన్ వేయాలి.. విత్ డ్రా చేయాలో పోలీసులే అదేశిస్తున్నారమో ఏకగ్రీవం కావాలంటే డీఎస్పీలే చేస్తున్నారుని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో అదే జరిగిందని అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు. పోతాయి అని బెదిరిస్తున్నారని మొత్తం పోలీసులు చేస్తే మీరు ఎందుకు.. మంత్రులు ఎందుకు ? అని అన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి విత్ డ్రా చేసుకుంటే కోటి రూపాయలు ఆఫర్ చేస్తున్నారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: