ఒకప్పుడు రాజకీయ పార్టీలకు  అయితే గనుక ఏదైనా ఒక సభ పెడితే... అంటే మూడు నాలుగు జిల్లాలకు కలిపి ఒక సభ పెట్టడం అక్కడికి  ముఖ్యమంత్రి లేక పార్టీకి సంబంధించిన ప్రముఖులు ప్రత్యేకంగా రావడం. అదే విధంగా ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఆ సభకు హాజరు కావడం ఇక ఆ సమావేశంలో కొన్ని కీలక అంశాలు చర్చించుకోవడం అలా ఆ సభ ముగిసిపోయేది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ హ్యాండోవర్ చేసుకున్న తర్వాత.. అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో అతి పెద్ద మార్పు ఏమిటయ్యా అంటే..?? కార్పొరేటర్, కౌన్సిలర్ కంటే ఎక్కువగా తిరిగేవారు ఆయన. అయితే  ఇది రొటీన్ అయి పోవడం వలన దాంట్లో కొత్త దనం కావాల్సి వచ్చింది.

కాబట్టి ఆ తర్వాత కాలంలో తమ పార్టీ కోసం ఏదైనా సభలు ఏర్పాటు చేసినప్పుడు పార్టీ వైపు చైతన్య పరిచే విధంగా పాటలు పెట్టుకోవడం.. రండి కదలి రండి అంటూ తమ పార్టీలకు అతీతంగా పాటలు రాసి మరీ వాటిని వినియోగించేవారు. ఇది ఎమోషనల్ గా ప్రజలకు చాలా దగ్గర అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పార్టీ స్థాపించిన పోతున్న వైయస్ షర్మిల తన పార్టీ కోసం ఓ కొత్త పాటను దగ్గరుండి మరీ సమకూర్చుకోవడం విశేషం. ఆ పాటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి యొక్క గొప్ప పరిపాలన గురించి చెప్పుకొచ్చారు. రాజశేఖర ఓ రాజశేఖర ప్రజల కోసం ప్రాణం పెట్టిన మహానేతవు అయ్యా... రాజన్న రాజ్యం రావాలని షర్మిలమ్మ బయలుదేరెను అయ్యో ... వంటి పదాల సమ్మేళనంతో తయారైన ఆ పాట ప్రజలను ఎంతో ఆకట్టుకుంటోంది.

ఈ పాటలో ఓ వైపు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి యొక్క గొప్ప పరిపాలన గురించి చెబుతూనే మరోవైపు ఆయన అడుగు జాడల్లో ప్రజలకు సేవ చేసేందుకు షర్మిలమ్మ బయలుదేరారు అంటూ... వైయస్ షర్మిల పార్టీకి సంబంధించిన ప్రచారంకు సరిపోయేలా పాటను సమకూర్చారు. ఇక పాట ప్రత్యేకత విషయానికి వస్తే, ఆవేదన లోనుంచి పుట్టుకొచ్చేది ఆవేశం... ఆవేశం లో నుంచి పుట్టుకొచ్చే అనే పాట ఇటువంటి నిలదీసే పాటలకు పెద్ద వేదిక తెలంగాణ. అయితే వీటినే ఈమధ్య తమ పార్టీ పట్ల చైతన్యం పెంచేలా తమకు నచ్చిన తాము మెచ్చిన నేతల కోసం చేసి పాడుతున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో షర్మిల నూతన పాట కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: