బీజేపీ జాతీయ పార్టీ. తెర వెనక నేపధ్యం చూస్తే ఆరెస్సెస్. బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి ప్రాతిపదికన బీజేపీ పనిచేస్తుంది. బీజేపీ అన్ని రాజకీయ పార్టీల లాంటిది కాదు. తేడా పార్టీ అని వారే చెప్పుకున్నారు. మిగిలిన పార్టీలు అధికారంలోకి  వస్తే తాము చెప్పిన హామీలను నెరవేర్చాలనుకుంటారు. బీజేపీ తాను ప్రవచించిన సిద్ధాంతాలను పరిపూర్తి చేయాలనుకుంటుంది.

ఇక బీజేపీకి తగిన సమయం ఇదే. ప్రధాని మోడీ అధికారంలో ఉన్నపుడే తమ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేయాలన్నది బీజేపీ ఆరాటం. అందులో భాగమే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం. దేశంలో ప్రభుత్వం భారంగా మోసే వాటిని ప్రైవేటీకరణ చేసి కేవలం తాము పాలనకే పరిమితం కావాలన్నది బీజేపీ ఆలోచన. అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను చూడాలని అంటున్నారు. ఇపుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్న అంశం ఏపీలో మిత్రుల మధ్య అతి పెద్ద చిచ్చు పెట్టేలాగ కనిపిస్తోంది. బీజేపీతో కూడితే మోడీ బలమైన నాయకత్వంతో ఏపీలో కూడా పాగా వేయవచ్చునని జనసేన తలచింది. కానీ బీజేపీ అగ్ర నాయకత్వం మాత్రం ఏపీ మీద పూర్తిగా ఆశలు వదిలేసుకునేలా ఉందిపుడు. అందుకే అందరూ వద్దన్నా కూడా ఉక్కు ప్రైవేటీకరణను ముందుకు తెస్తోంది. దీంతో బీజేపీతో జట్టుకట్టినందుకు జనసేనకు ఇబ్బందుకు ఎదురవుతున్నాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ విశాఖ ఉక్కు విషయంలో తన ఆలోచనలు మార్చుకోకపోతే పొత్తు విషయంలో తాము ఆలోచించాల్సి ఉంటుందని బీజేపీ నేత నాదెండ్ల మనోహర్ తాజాగా హెచ్చరించారు. ఇది బీజేపీకి ఊహించని పరిణామమే. మరి దీని మీద బీజేపీ ఎలా ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి. బీజేపీ పెద్దలు మాత్రం ప్రైవేటీకరణ వైపే వేగంగా అండుగులు వేస్తున్నారు. అలా కనుక ఆలోచిస్తే మాత్రం జనసేన తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: