ప్రస్తుత సమాజంలో జనాల్లో నేరప్రవృత్తి విపరీతంగా పెరిగిపోతోం. క్షణికావేశంలో అనేక ఘోరాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న కారణాలకే కొట్టుకు చస్తున్నారు జనాలు. మాటలతో సమసిపోయే వివాదాలను చంపుకునే దాకా తీసుకెళ్తున్నారు. రక్త సంబంధాన్ని కూడా మరచిపోయి రక్తాన్ని కళ్ల చూస్తున్న కేసులు కొన్ని చోట్ల చిల్లర కోసం చంపుకునే పరిస్థితి నెలకొంది. అందుకే ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి మనుషులు చంపుకునే దాకా వెళుతున్నారు. 

దానికి ముఖ్య కారణం మద్యం అనే చెప్పాలి. దాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలు దాని మీద నుండి వచ్చే రెవెన్యూతోనే నడుస్తూ ఉన్నాయి. దీంతో మద్య నిషేధం లాంటివి జరగడం కల్లే.మరీ దారుణంగా ఒక వ్యక్తి ఇంటి అద్దె చెల్లించే విషయంలో జరిగిన గొడవ వలన చనిపోయాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దారుణం చోటు చేసుకుంది. 

పాలకొల్లు పట్టణం స్థానిక 13వ వార్డు ముచ్చర్ల వారి వీధి రామాలయం వద్ద వంగా ప్రసాద్ నివాసంలో అద్దెకుంటున్న అడపా చిన్న కొండయ్యను ఇంటి అద్దె  రెండు నెలల క్రితం నుంచి బాకీ ఉండటంతో అద్దె అడగగా వారి మధ్య వాగ్వివాదం జరిగింది. మద్యం మత్తులో ఉండటంతో ఘర్షణ చోటు చేసుకుంది. అడపా చిన్న కొండయ్య ఇంటి యజమాని  ప్రసాద్ ను రాయితో బలంగా కొట్టడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అడపా చిన్న కొండయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు తానుగా లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: