బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గోవధ నిషేధ చట్టం రైతులకు ఎక్కడలేని కష్టాలు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా మగ లేగదూడల పాలిట శాపంగా మారుతోంది. వాటిని అమ్మలేక, పెంచలేక రైతులు ఏకంగా అడవుల్లోకి తీసుకె్ళలి పులులు తిరిగే ప్రాంతంలో వాటిని వదిలేన్నారు. దీంతో అవి పులులకు ఆహారంగా మారుతున్నాయి. కొత్త చట్టం వల్ల గోవులను, దూడలను చంపేందుకు వీలు లేకపోవడం, మగ దూడల వల్ల ఎలాంటి లాభం లేకపోవడంతో రైతులు వాటిని స్థానిక శ్రీగవి రంగనాథస్వామి ఆలయ సమీపంలోని అడవిలో వదిలి పెడుతున్నారు. ‘మగ దూడల వల్ల ఎలాంటి లాభం ఉండదు. వాటిని పెంచడానికి కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే బాధగా ఉన్నా వాటిని అలా అడవుల్లో వదిలేస్తున్నామం’టూ రైతులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే రైతులు ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. గర్భంతో ఉన్న సమయంలోనే పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకునే వీలు కల్పించాలని, అప్పుడు మగ దూడ అయితే అవి గర్భంలో ఉండగానే అబార్షన్ చేయించేసేందుకు వీలవుతందుని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.

బిల్లెనహళ్లి ప్రాంతానికి చెందిన నాగరాజు అనే రైతు మాట్లాడుతూ.. ‘దేశీయ గోవులకు సంబంధించిన మగ వాటినే పునరుత్పత్తికి వినియోగిస్తాం జెర్సీ, హాల్‌స్టెయిన్ ఫ్రెసియన్ వంటి హైబ్రిడ్ జాతులను వినియోగించడం జరగదు. అలాంటప్పుడు ఆ జాతికి చెందిన మగ దూడలు ఎందుకూ పనికిరావు. వాటివల్ల మాకు ఎలాంటి లాభముండదు. వాటిని పెంచడం కూడా ఆర్థికంగా భారమవుతుంది. అందుకే అడవుల్లో వదిలేస్తున్నామం. ఇంకేమీ చేయలేమ’ని చెబుతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ విధంగా మగ దూడలను అడవుల్లో వదిలేయడం వల్ల అక్కడి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా దూడల రూపంలో సులభంగా ఆహారం దొరికితే చిరుతలు ఇటువైపు ఆకర్షితమవుతాయని, అప్పుడు వీటిని వేటాడడం అలవాటు ఇక్కడికి ఎక్కువగా చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

అప్పుడు మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రైతులు దూడలను వదిలుతున్న ప్రాంతం చిరుతలకు ఆవాసం కావడం వల్ల అక్కడికి ఎక్కవు చిరుతలు వస్తే ప్రజల ప్రాణాలకూ ప్రమాదమేనని, అడవిలోని ప్రకృతి సమతౌల్యత అస్తవ్యస్తమువుతందని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: