హైదరాబాద్ ఓల్ట్ సిటీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది చార్మినార్. రాజకీయంగా అయితే ఎంఐఎం పార్టీ. దశాబ్దాలుగా  పాతబస్తీలో ఏకపక్ష విజయాలతో  పట్టు సాధించింది పతంగి పార్టీ. ఇప్పుడు ఎంఐఎం పార్టీ హైదరాబాద్ దాటి దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. దేశంలో ముస్లింలు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ పోటీ చేస్తూ  సత్తాచాటుతోంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ దేశ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారారు. బీజేపీ టార్గెట్ గా ఆయన దేశ వ్యాప్తంగా వాయిస్ వినిపిస్తున్నారు.

 తాజాగా మరోసారి కమలం పార్టీపై ఘాటు విమర్శలు చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్.
ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో  ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఎంఐఎం ఉన్నంత వరకు ఓల్డ్ సిటీలో బీజేపీకి మనుగడ ఉండదన్నారు. బల్దియా ఎన్నికల్లో గెలిస్తే ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తా అన్నారు. ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్జికల్ స్ట్రైక్ చేయండని సూచించారు. అహ్మదాబాద్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని
విమర్శించారు. బల్దియా ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించటానికి ఓల్డ్ సిటీలో యూపీ సీఎం, బీజేపీ టీమ్ అంతా దిగిందని ఎద్దేవా చేశారు. ఎంత మంది వచ్చినా.. ఎవరు వచ్చినా ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు తిరుగులేదన్నారు. బీజేపీ పప్పులు ఓల్డ్ సిటీలో ఉడకవన్నారు. ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం అడ్డా అని... భయపెడితే ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరన్నారు.

మహా రాష్ట్రలో గత సంవత్సరామ్ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు శాసన సభ స్థాలను గెలుచుకున్న ఎంఐఎం ఆ తర్వాత జరిగిన ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో 53 చోట్ల పోటీ చేసి, 25 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది.అంతే కాదు మొత్తం 113 స్థానాలున్నా కార్పొరేషన్’లో ఎంఐఎం మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.ఐదారు నెలల క్రితం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఐదు స్థానాలు దక్కించుకుంది.ఈమధ్యనే గుజరాత్’లో జరిగిన ఆరు మున్సిపల్  కార్పొరేషన్ల  ఎన్నికల్లో మెత్తం ఏడు చోట్ల విజయ కేతనం ఎగరేసింది . అంతకు ముందే కర్ణాటక స్థానిక సంస్థలలోనూ కాలు పెట్టింది.త్వరలో జరుగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై’ అంటోంది . అంతే కాదు వచ్చే సంవత్సరం జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నామని ఒవైసీ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: