మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రజల్లో పార్టీతో నిమిత్తం లేకుండా ఒక్క ప్రజా నాయకుని పై కూడా సరైన గౌరవం లేదు. గౌరవానికి అలాంటి అర్హత ఉన్న వాళ్లెవరు కలికానికి కూడా కానరారు. ఎన్టీఆర్ మరియు వారి ముందు తరం నాయకులకు ప్రజల్లో కొంత గౌరవం ఉండేది. అయన కొన్ని ప్రజా ప్రయోజన పథకాలు, దరిద్ర నారాయణులకోసం కొన్ని  సంస్కరణలు,  సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా కూడా ఆయన అభివృద్ధిని మరువలేదు.  అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి మేలుచేస్తూ సంక్షేమ పథకాలతో అవసరమైన వారికి మేలు జరిగేలా చూసారు.




అయితే దీనికి వ్యతిరేఖంగా సినిమా రంగం నుండి వచ్చిన కారణంగా ఎన్టీఆర్ పాలనా కాలంలో అక్కడి వాతావరణంలోని కుల ప్రాధాన్యం రాజకీయాల్లో విస్తృతమవుతూ వచ్చింది. చంద్రబాబు పాలనా కాలంలో ప్రజా పరిపాలన అంతరించి ఆ స్థానంలో ప్రజా పాలన అటకెక్కి - అడ్మినిస్ట్రేషన్ & మేనేజ్మెంట్ గా మారిపోయింది.




ఎన్నికలప్పుడు మాత్రం గెలుపే లక్ష్యంగా పొలిటికల్ మానేజ్మెంట్ రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. అంతేకాదు బంధు, కుల, రాజకీయ మిత్రవర్గ ప్రాధాన్యం తారాస్థాయికి చేరింది. అందుకే సంక్షేమ పథకాలతో ఎన్నికల్లో గెలిచి - అభివృద్ధిని ప్రక్కన పెట్టేసి తమకు బంధు కుల రాజకీయ మిత్రవర్గాలకు ప్రయోజనాన్నిచ్చే  పథకాల్ని మాత్రమే అభివృద్ధిగా పూర్తిచేస్తూ వచ్చారు.




ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనా కాలంలో పథకాలన్నీ కేంద్రంలోని కాంగ్రెస్ పథకాలే. వాటిలో చెప్పుకోదగ్గది ఆరోగ్యశ్రీ - అది వైఎస్సాఆర్ కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. వీటికి అదనంగా వైఎస్ఆర్ కాలంలో మత ప్రాబల్యం రాజకీయాల్లో కి రావటం మొదలైంది అవినితి తారాస్థాయికి చేరింది. అనేకమంది ఉన్నతా ధికారులు అవినీతి ఊబిలో జైళ్ల పాలయ్యారు. అయితే ఇదే సమయంలో వైఎస్సాఆర్ ను ప్రకృతి కబళించింది.




ఆ తరవాత రాజకీయాల్లో వచ్చిన మార్పులతో రాష్ట్ర విభజన జరిగింది. ఎపి లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి – ఎవరు ఔనన్నా కాదన్నా క్రిష్టల్ క్లియర్గా కనిపించే “కాస్ట్ సెంట్రిక్ కాపిటల్ అమరావతి”  రాజకీయం మొదలైంది. మొత్తం మీద కాంగ్రెస్ తో విభేదించిన జగన్ 'వైఎస్సాఆర్ కాంగ్రెస్' స్థాపించి విపక్షంలో నిలిచారు.




ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అయన వేసిన రాజకీయ కుప్పిగంతులు చూసి దేశం నివ్వెరపోయింది. ఆయన్ను దేశ, రాష్ట్ర వ్యాప్తంగా జనం అసహ్యించు కోవటం అధికారం కోల్పోయి - వైసిపి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.



ఆంధ్రాలో మొదలైన కుల మత దారిద్ర రాజకీయాన్ని ఇప్పుడు వైఎస్ షర్మిల తన భుజాలపై మోసుకొని కొంపముంచే కోడలు వామపాదం పెట్టింది నా మెట్టిల్లంటూ తెలంగాణ గడపలో. ఈ మత వేషాలు నచ్చని ఇక్కడి ప్రజలు. గతంలో ఇక్కడ మతం కులం ప్రాబల్యం ఉన్నా అదో తీరు. కానీ ఎపి నుండి దిగుమతైతే అది బహిర్గతమే.



సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు, షాకింగ్ వ్యాఖ్యలు చేస్తూ,  వార్తల్లో నిలుస్తున్నారు తండ్రి వైఎస్ ఆర్ ముద్దుల తనయ వైఎస్ షర్మిల. తెలంగాణలో ఆమె పార్టీని ఏర్పాటు చేయాలన్న సంచలన నిర్ణయాన్ని పలువురు ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి. రాజకీయ విమర్శల్లో అందరి కంటే ముందుండే టీఆర్ఎస్ సైతం, షర్మిల రాజకీయ ఎత్తుగడలను జాగ్రత్తగా గమనిస్తుందే తప్పించి,  తొందరపడి ఒక్క మాట అనని పరిస్థితి. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసే క్రమంలో ఆమె చేపట్టిన కార్యక్రమాలపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
 

ఇదిలా ఉంటే, ఈ మధ్యనే ఆమె విద్యార్థులతో భేటీ నిర్వహించారు. తెలంగాణ యువత ఆకాంక్షల్ని నెరవేరుస్తామన్నారు. ఈ సందర్భంగా వేదిక మీద ఒక విద్యార్థి ఆవేదనతో తన ఉదంతాన్ని చెప్పుకోవటం, కదిలిపోయిన షర్మిల అతడ్ని ఓదార్చటం అందరిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే, ఈ ఎపిసోడ్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్-బ్రాండ్ కమ్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భావోద్వేగంతో మాట్లాడిన యువకుడు విద్యార్థి ఎంత మాత్రం కాదన్నారు. షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు “సునంద జోసెఫ్”  అని, అతడు విద్యార్థి కాదు నిరుద్యోగి అంతకన్నా కాదని తేల్చేశారు. ఆ యువకుడు ‘కల్వరి టెంపుల్” లో ఆర్కెస్ట్రా వాయిస్తుంటాడని పేర్కొన్నారు. అతడి తండ్రి దివంగత మహా నేత వైఎస్సార్ కంటే ముందే మరణించారన్నారు. ప్రజల చూపును తన వైపుకు తిప్పుకునేందుకు షర్మిల ఇలా చేస్తున్నారని, రేవంత్ రెడ్డి సరిగానే వివరణ ఇచ్చారు.


ఏపీలో హిందూ దేవాలయాలపై పూజారులపై దేవత విగ్రహాలపై జరిగే అరాచకంతో అక్కడ వైఎస్ జగన్ విధానం అధిక సంఖ్యాకులకు అవగతమైంది. అక్కడి సాదు సంతులను ఇప్పటికే మేల్కొన్నారు. అందుకు జగన్ భవిష్యత్ లో రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా మూల్యం చెల్లించుకుంటారు.


అక్కడ చంద్రబాబు పై ఉన్న ఏహ్యభావం - దానికి తోడు ఆయనకు జాకీలేసే సామజిక వర్గ మీడియా చేతలు - ఇంకా జగన్ ను భరిస్తున్నాయి. అదే సరైన రాజకీయ నాయకత్వం అటు టిడిపికి ఇటు వైసిపికి ఝలక్ ఇచ్చేలా రూపుదిద్దు కుంటే ఇద్దరు ఫినిషే! జస్ట్ టైం ఈజ్ డిసైడ్స్ ది మ్యాటర్.


ఆమె అన్నకు ఏ మాత్రం మత ప్రచారంలో ఈ మాత్రం తీసిపోదని అనిపిస్తుంది జనాలకు. “అన్న అంతర్గతమైతే - చెల్లి బహిర్గతమే” అంతే కాదు ఆమె వెనుక ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారని - తల్లి విజయమ్మ (ఎల్లప్పుడూ బైబిల్ పట్టుకొని తిరుగుతారీమె!) తనకు తోడుంటారని వైఎస్ షర్మిల కన్ఫామ్ చేసేసారు ఇప్పటికే. దీంతో ఆమె రాజకీయ స్వరూప స్వభావం జనాలకు తేటతెల్లమైందని లోకం కోడై కూస్తుంది. అలాగే దీనికి రేవంత్ రెడ్డి సరిగానే వివరణ ఇచ్చారు.


తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయటానికి ముందే - ఏపీలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల్ని బహిరంగంగా వ్యతిరేకించే ధైర్యం ఉందా? అని రేవంత్ రెడ్డి షర్మిలను సూటిగానే ప్రశ్నించారు.


గత పాదయాత్ర లోభాగంగా “సమైక్యాంధ్రకు అనుకూలం” గా మాట్లాడిన షర్మిల జరిగిన దానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలన్నారు. సెంటిమెంట్ తో తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే సాధ్యం కాదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్-టాపిక్ గా మారాయి.


రానున్న ఎన్నికల్లో వైఎస్ షర్మిల ప్రదర్శించబోయే అత్యధిక సంఖ్యాకుల పట్ల వ్యతిరేఖత, రాజకీయంగా వేరుదారులైనా సాంస్కృతికంగా ఒకేలా ఉండే ఉభయ తెలుగు రాష్ట్రాలలో  ప్రజలు అర్ధం చేసుకుంటే - అక్కడ ఏపీలో కూడా వైసిపికి దెబ్బ పడుతుంది.



వైఎస్ షర్మిల ఎవరేసిన బాణమైనా! తగిలేది డైరెక్ట్ గా వైఎస్ జగన్ కె ! ఇది ఏపీలో అధికార పార్టీకి ఈ శరం, దారుణ శరాఘాతమే. అనుమానం అక్కర్లేదు




మరింత సమాచారం తెలుసుకోండి: