చైనా హ్యాకర్లు మరీ హద్దుమీరి పోతున్నారు. ఇండియా లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. గత ఏడాది ముంబయిలో జరిగిన గ్రిడ్ ఫెయిల్యూర్‌ కు కారణం చైనా హ్యాకర్లేనని తేలింది. అయితే ఈ ప్రభావం ఒక్క ముంబయితోనే ఆగలేదట.. మరీ షాకింగ్ వాస్తవం ఏంటంటే.. చైనా హ్యాకర్లు తెలంగాణ ట్రాన్స్‌కో, జన్‌కో సర్వర్లనూ హ్యాక్ చేసే ప్రయత్నం చేశారట.. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ట్రాన్స్‌కో, జన్‌కో సీఎండీ దామోదరరావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని సర్వర్లలోకి చైనాకి చెందిన థ్రెట్ యాక్టర్ హ్యాకింగ్ గ్రూప్ ప్రవేశించి విద్యుత్ వ్యవస్థను ప్రభావతం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా  గుర్తించిందని తెలంగాణ ట్రాన్స్‌కో, జన్‌కో సీఎండీ దామోదరరావు  తెలిపారు. రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిందని.. సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. భారతదేశ గ్రిడ్ మాత్రమే కాకుండా.. రాష్ట్ర గ్రిడ్ , విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని సబ్ స్టేషన్లకు కూడా థ్రెట్ యాక్టర్ ప్రవేశించినట్లు తెలుస్తోందని సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. రాష్ట్ర విద్యుత్ సాంకేతిత విభాగం వెంటనే అప్రమత్తమై వాటిని ఎక్కడిక్కడ నిరోధించే చర్యలు తీసుకుంటోందని.. గ్రిడ్ కు సంబంధించిన అధికారులు, సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించామని తెలంగాణ ట్రాన్స్‌కో, జన్‌కో సీఎండీ దామోదరరావు  వివరించారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని.. వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

దీన్ని బట్టి తెలంగాణ ట్రాన్స్‌కో సర్వర్లు హ్యాక్‌ చేసేందుకు చైనా హ్యాకర్లు యత్నించినట్లు  తెలుస్తోంది.  చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వెల్లడైంది. మొత్తానికి కేంద్రం హెచ్చరికలతో  తెలంగాణ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్ శాఖ వెబ్ సైట్ లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను మార్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: