ప్రస్తుతం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ఎక్కువమంది కస్టమర్లను కలిగిన బ్యాంకుగా  కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే . టెక్నాలజీకి అనుగుణంగా రోజురోజుకి తమ  సర్వీసులని పునరుద్ధరించుకుంటు ముందుకు సాగుతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ కస్టమర్లకు సెక్యూరిటీ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయదు  అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సైబర్ నేరగాళ్ల బారిన తమ కస్టమరర్లు  పడకుండా ఉండేందుకు..  ఎప్పటికప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ ఉంటే తప్పకుండా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.



 ప్రస్తుతం ఎంతోమంది సైబర్ నేరగాళ్లు స్టేట్ బ్యాంకు ఖాతాదారులను  టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ ఖాతాదారులను అప్రమత్తం చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంతో మంది స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు టెక్స్ట్ మెసేజ్ పంపించి..  మీరు  ఎస్బిఐ క్రికెట్ పాయింట్స్ పొందారని రీడిమ్  చేసుకోవాలి అంటూ మెసేజ్ ను పంపించడం.. ఇక ఆ తర్వాత ఖాతాదారుడు దీని పై క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ సమాచారాన్ని సేకరించి ఖాతా  ఖాళీ  చేయడం లాంటివి చేస్తున్నారట కేటుగాళ్ళు.



 మీకు ఇలాంటి మెసేజ్ లు వస్తే మాత్రం అలాంటి లింకులపై క్లిక్ చేయవద్దు అని అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ పొరపాటున ఇలాంటి లింక్ పై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  ఒకవేళ మీరు ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందని..  ఇందులో ఎలాంటి వివరాలు ఎంటర్ చేసిన ఇక మీ ఖాతాలో డబ్బులు ఖాళీ అవుతాయని అందుకే ఖాతాదారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.  ఇలాంటి మెసేజ్లు విషయంలో ఎప్పుడూ ఖాతాదారులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: