సాధారణంగా అయితే ఎవరైనా సరే ఎక్కువగా బాధ వస్తే ఏడుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎవరైనా ఏడుస్తూ ఉన్నారు అంటే చాలు కళ్ల నుంచి నీరు పటపటా కారిపోతూ ఉంటాయి. మరి కొంత మంది ఎక్కువ ఆనందం వచ్చినా కూడా ఇలా ఏడుస్తూ కనిపిస్తూ ఉంటారు.  అయితే ఇలా ఆనందం రాకున్నా బాధ రాకున్నా ఏడ్చేది మాత్రం కేవలం ఉల్లిపాయలు కోసేటప్పుడు మాత్రమే అన్న విషయం తెలిసిందే ఎంత మహామహుడు అయినా సరే ఉల్లిపాయల కోసేటప్పుడు తప్పకుండా కంటి నుంచి నీరు రావాల్సిందే.



 ఇలా ప్రతి ఒక్కరు ఉల్లిపాయల కోసేటప్పుడు తప్పనిసరిగా కంటనీరు పెట్టుకున్నారు. అంతలా ఉల్లిపాయ ఘాటు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మీ ఇంట్లో కూడా వంట చేసే వారు ఇలా ఉల్లిపాయలు కోస్తున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇక ఏడుస్తున్నారు అంటూ వాళ్ళని మీరు ఎగతాళి చేయడం లాంటివి జరిగే ఉంటాయి. సాధారణంగా ఉల్లిపాయ కోయగానే అందులో నుంచి సల్ఫర్ గ్యాస్ విడుదలై ఇక ఆ తర్వాత ఉల్లిపాయ కోస్తున్న వారి కళ్లల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. అయితే కళ్ల నుంచి నీరు కారకుండా ఉల్లిపాయలు కొయ్యడం ఎలా అన్నది చాలామందికి తెలియదు అన్న విషయం తెలిసిందే. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే మాత్రం కళ్ల నుంచి నీరు రాకుండానే  ఉల్లిపాయలు కోవచ్చు అని చెబుతున్నారు.



 మీరు ఉల్లిపాయలు కట్ చేయాలి అనుకుంటే 15 నిమిషాల ముందు ఇక వాటిని ఫ్రిజ్లో ఉంచడం వల్ల ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు రాకుండా ఉంటాయి. అంతేకాదు ఉల్లిపాయల పైపొర తీసేసి నీటిలో వేస్తే కళ్లు మండటం కూడా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా పదునైన కత్తి తో కట్ చేస్తే రసాయనాలు తక్కువగా విడుదలై  ఇక కళ్లనుంచి నీళ్ళువచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందట. ఇక మంటకు దగ్గరగా ఉండి ఉల్లిపాయ కట్ చేసినా కూడా కళ్లనుంచి నీళ్ళు రావట. అంతేకాకుండా గాలి ఎక్కువగా ఉన్నా ప్లేస్ లలో కూడా ఇలా ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళలో నుంచి నీళ్లు రావు అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: