అవును.. భయపడినంతా జరిగింది.. జరిగింది కాదు.. ఇంకా జరగబోయేది తలచుకుంటే మరింత భయం వేస్తోంది.. గత ఏడాది అక్టోబర్‌లో ముంబయిలో గంటల తరబడి విద్యుత్తుకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. గ్రిడ్  ఫెయిల్యూరే కారణమని అనుకున్నారు అంతా.  అక్టోబరు 12న  ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా స్తంభించి అనేక రైళ్లు, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు వంటి తదితర కార్యక్రమాలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్‌ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మొదట్లో ఇదేదో  టెక్నికల్ ప్రాబ్లం అనుకున్నారంతా.. కానీ.. ఆనాటి  ముంబై పవర్‌ కట్‌ వెనక ఉన్నది చైనా హ్యాకర్లేనని ఇటీవల ఓ అమెరికన్‌ సంస్థ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కేంద్రం స్పందించింది. అవును.. ఇండియన్  పవర్‌ గ్రిడ్‌ పై హ్యాకింగ్ జరిగిన మాట వాస్తవమే అని ఏకంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అంగీకరించారు. అయితే.. హ్యాకింగ్ దాడి జరిగినా దానికి మన విద్యుత్‌ ఆపరేటింగ్‌ సిస్టిమ్స్ ప్రభావితం కాలేదని ఆయన అంటున్నారు. అయితే ఇది చైనా పనే  అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్‌ అంటున్నారు.

ముంబయిలో విద్యుత్తు అంతరాయంపై దర్యాప్తు చేసిన రెండు బృందాలు నివేదిక సమర్పించాయని ఆర్‌.కె. సింగ్‌ వెల్లడించారు. ఒక బృందం మానవ తప్పిదం కారణంగానే గ్రిడ్‌ విఫలమైందని నివేదిక సమర్పించిందని.. మరో బృందం సైబర్‌ దాడి జరిగిందని నిర్ధారించిందని ఆర్‌.కె.సింగ్ వివరించారు. చైనా, పాకిస్తాన్‌ దేశాలే సైబర్‌ దాడికి దిగాయనేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. ముంబయిలో విద్యుత్తు అంతరాయంపై మా బృందం దర్యాప్తు చేసి నివేదిక సమర్పించిందని ఆయన వివరించారు. అయితే.. మానవ తప్పిదం కారణంగా గ్రిడ్ విఫలం కావడం వల్లే విద్యుత్తుకు అంతరాయం ఏర్పడిందని ఒక బృందం చెప్పిందని..  సైబర్‌ దాడి జరిగిందని మరో బృందం నివేదించదని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: