ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడి వేడిగా  జరుగుతున్న క్రమంలో ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది అనే విషయం తెలిసిందే.  చిత్తూరు పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు నాయుడును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించారు. ఇది కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా  మారిపోయింది.  చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏకంగా ఐదు వేల మంది టీడీపీ నేతలతో కలసి ధర్నా నిర్వహించాలని భావించిన  చంద్రబాబుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఇక అటు టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు నిర్బంధించిన సమయంలో చంద్రబాబు ఎలాంటి అసహనానికి గురి కాకుండా ఏకంగా నేల మీద కూర్చుని అక్కడ ధర్నా చేపట్టడం సంచలనంగా మారింది.



 అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయంలో ఏకంగా నేల పై కూర్చుని కనీసం నీరు కూడా తాగకుండా ధర్నా చేయడం సంచలనంగా మారింది. ఇకపోతే జగన్ సర్కార్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ని అడ్డుకోవాలని అనుకున్నప్పటికీ... చివరికి విమానాశ్రయంలోనే ధర్నాకు దిగిన చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విజయం సాధించారు అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఇక అటు తెలుగు తమ్ముళ్లు అందరికీ కూడా హింసాయుత రాజకీయాలను గట్టిగా నిలబడితే ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని తన ధర్నాతో చెప్పకనే చెప్పారు అని అంటున్నారు విశ్లేషకులు.




 ఒకవేళ చిత్తూరు పర్యటన కోసం చంద్రబాబును జగన్ సర్కారు వదిలేసి ఉంటే అక్కడ కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వంపై నాలుగైదు విమర్శలు చేసి వెళ్ళిపోయే వారిని... కానీ ప్రస్తుతం చంద్రబాబును  అడ్డుకోవడం వల్ల ఏకంగా విమానాశ్రయంలో ధర్నాకు దిగడం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా నిరసన తెలపడం..  జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం జగన్  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లోకి వెళ్లడం..  అంతేకాకుండా కార్యకర్తలలో  ధైర్యం నింపడం  లాంటివి చంద్రబాబు చేసాడు అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా చంద్రబాబును అడ్డుకున్నప్పటికీ  చంద్రబాబు జగన్ సర్కార్ పై విజయం సాధించారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: