కరోనా.. ప్రపంచం మొత్తాన్ని వణికించిన సమస్య.. కానీ.. ఈ సమస్య కొందరు ఇండియన్లకు మాత్రం ఏమాత్రం సమస్య కాలేదు. అంతేకాదు.. వాళ్ల సంపద అంతకుముందు కంటే అనేక రెట్లు పెరిగింది. కొందరు ఏకంగా ప్రపంచ కుబేరుల జాబితాలోనూ కొత్తగా చోటు సంపాదించుకున్నారు. అవును.. కరోనా సమయంలో ఏకంగా ఇండియా నుంచి కొత్తగా 40 మంది బిలియనీర్లు తయారయ్యారు. ఈ విషయాన్ని హురున్ గ్లోబల్ రిచ్ అనే సంస్థ ప్రకటించింది.

ఈ సంస్థ ప్రకటించిన  తాజా ర్యాకింగులు వివరాలు చూస్తే.. మన కళ్లు బైర్లు కమ్మకమానవు.. అవును మరి.. కరోనాతో ఏడాది కాలంగా ప్రపంచమంతా సతమతం అవుతున్నా వీళ్లు మాత్రం తెగ సంపాదించేశారు. బిలియనీర్ల జాబితాలోకి కొత్తగా చేరారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో కొత్తగా 40 చేరిన 40 మందితో కలిపి భారతీయ బిలియనీర్ల జాబితా 177కి పెరిగిందట.

ఇక ఈ జాబితాలో ఉన్న వాళ్ల వివరాలు చూస్తే.. అందరికంటే ఎక్కువగా రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. భారత్‌లో అత్యంత సంపన్నుడిగా ఫస్ట్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు. అంతే కాదు.. ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలోనూ ర్యాంకు మెరుగుపరుచుకున్నాడు.. గతంలో 9 ప్లేస్‌లో ఉండేవాడు ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 8 ర్యాంకు సాధించాడు. ఆయన  సంపద గత ఏడాది 24 శాతం మేర పెరిగింది.

ఇక గుజరాత్‌కే చెందిన మరో పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సంపద కరోనా సమయంలో ఏకంగా రెట్టింపైందట. ఈయన సంపద మొత్తం 32 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచ ధనవంతుల జాబితాలో 48వ స్థానంలో నిలిచారు. ఆయనే కాదు.. ఆయన సోదరుడు వినోద్ అదానీ సంపద కూడా 128 శాతం మేర పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు చేరిందట. ఇంకా వీరితో పాటు జయ్‌ చౌదరి, బైజు రవీంద్రన్‌, ఆనంద్ మహీంద్రా, కిరణ్ మజుందార్‌షా తదితరులు కుబేరుల జాబితాలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: