కర్ణాటకలో ఓ మంత్రి చేసిన పనికి ప్రభుత్వమే తల దించుకుంది. ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతున్న వీడియో బయటకు రావడంతో అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. ఓ ఉద్యమకారురాలు సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయట పడింది. మంత్రి రమేష్ జరకిహోలి ఓ మహిళతో శృంగారంలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు దినేష్ మలహల్లి అనే ఆర్టీఐ కార్యకర్త కబ్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు ఇంకా నమోదు చేయనట్లు కనిపిస్తోంది. వీడియో పరస్పర ఇష్టంతోనే శృంగారంలో పాల్గొన్నట్లుగా కనిపిస్తోందని, దీనిపై అంతర్గత విచారణ జరుగుతోందని తెలిపారు.

మంత్రి రమేష్ జరకిహోలి గతంలో హెచ్‌డీ కుమార స్వామి ప్రభుత్వం కూలిపోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలను భాజపాలో చేర్పించుకోవడంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కర్ణాటక సీఎంగా బీఎస్ యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి రమేష్ జరకలిహోలికి ప్రభుత్వం నీటిపారుదల శాఖను కేటాయించింది.

అయితే, మహిళతో శృంగారంలో పాల్గొన్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త, నాగరిక హక్కుల పోరాట సమితి దేనేష్ కలహళ్లి డిమాండ్ చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు లేఖను కూడా రాశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. బాధితురాలు తన దగ్గరికి వచ్చి తనకు న్యాయం చేయాలని కోరడంతోనే ఈ విషయాన్ని బయట పెట్టానన్నారు. అయితే ఏకంగా మంత్రియే సెక్స్ స్కాంలో ఇరుక్కోవడంతో సీఎం యడియూరప్పకు తలనొప్పిగా మారింది. దీంతో మంత్రి రమేష్‌ను పదవి నుంచి తొలగించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: