చాల మంది ముల్లంగిని తినడానికి ఇష్టపడరు. అయితే ముల్లంగి రుచిని ఇష్టపడేవారు మాత్రం వాటిని పచ్చివి కూడా తింటుంటారు. ఇక ఉడకబెట్టిన వాటికంటే పచ్చివి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ముల్లంగిని రసం చేసి దాన్ని రోజూ ఉదయాన్నే తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందంటా. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల జలుబు, దగ్గు వంటివి కూడా దూరంగా ఉంటాయి.

అయితే ముల్లంగి వీలుంటే పచ్చిగా లేదా కూరల్లో భాగంగా కనీసం వారానికి రెండు సార్లు తీసుకోవడం మంచిది. కేవలం ముల్లంగి దుంపలు మాత్రమే కాదు.. ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని తీసుకోవచ్చు. కొంతమంది ముల్లంగి ఆకులతో కూర, పచ్చడి చేసుకుంటుంటారు. ఇటు రుచితో పాటు అటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి ఈ వంటకాలు. ముఖ్యంగా కామెర్లు, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలతో బాధపడేవారు ముల్లంగి, ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ ఉదయాన్నే తాగడం వల్ల సమస్య చాలా తక్కువ సమయంలో తగ్గే అవకాశం ఉంటుంది.

ఇక జీర్ణ కోశ సమస్యలు ఉన్నవారికి కూడా ముల్లంగి మంచి మందులా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ రసాలు సరైన మోతాదులో ఉత్పత్తి అయ్యి ఆహారం సులువుగా అరుగుతుంది. ఇందులో ఫైబర్ శాతం కూడా ఎక్కువ కాబట్టి మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవు. అంతే కాదు.. ముల్లంగిలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అరిగేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు కూడా దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఆకలిగా అనిపించకుండానే మీరు బరువు తగ్గే వీలు ఉంటుంది. అయితే మంచిది కదా అని ఎక్కువగా తినడం కూడా సరికాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: