వైసీపీలో హాట్ టాపిక్ ఇప్పుడు ఇదే! సామాజిక వ‌ర్గాల ఆధారంగా చూసుకుంటే.. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి వెలంప‌ల్లిని తొల‌గిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. అదేస‌మ‌యంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు మంత్రుల్లో ఒక‌రిని ఖ‌చ్చితంగా ప‌క్క‌న పెడ‌తార‌ని అంటున్నారు. వీరిలో కుర‌సాల క‌న్న‌బాబును త‌ప్పిస్తారా?  లేక ఆళ్ల నానిని త‌ప్పిస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. వీరిద్ద‌రూ కూడా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన నాయ‌కులు కావ‌డం.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. కొన్నాళ్లుగా కుర‌సాలపై వ్య‌తిరేత‌క పెరుగుతోంది. స్థానికంగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే.. ఆయ‌న‌పై ఫిర్యాదులు మోస్తున్నారు.

అయితే.. ఇక్క‌డ చిత్రంగా.. ఆళ్ల నానిపై ఎలాంటి ఫిర్యాదులూ లేవు. అయితే.. ఆయ‌న ప‌నితీరుపైనే జ‌గ‌న్ అసంతృప్తితో ఉన్నార‌ని స‌మాచారం. నిజానికి క‌రోనా స‌మ‌యంలో ఆళ్ల‌నాని బాగానే ప‌నిచేశారు. అయితే.. రావాల్సినంత క్రెడిట్ రాలేద‌నేది సీఎం భావ‌న‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు. ఇక‌, కుర‌సాల విష‌యాన్ని తీసుకుంటే.. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌మ‌ను ప‌నిచేసుకోనివ్వ‌డం లేద‌ని.. అంటున్నారు. ఇదే విష‌యంపై ఆయ‌న బ‌హిరంగ విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు.

 ఈ నేప‌థ్యంలో మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు కూడా బ్లాక్ లిస్ట్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం కాకినాడ వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. దీనిపై ఎవ‌రూ కూడా బ‌హిరంగ విమ‌ర్శ‌లు.. వాద‌న‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇదేస‌మ‌యంలో కాపు సామాజిక వ‌ర్గంలోనూ కుర‌సాల‌పై వ్య‌తిరేక‌త పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. త‌మ‌కు న్యాయం చేయ‌డం లేద‌నివారు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే ప‌రిశీలిస్తోంంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రిని తొల‌గిస్తారు? అనే విష‌యంలో ఏం జ‌రుగుతుంది? అనే విష‌యాల‌పై మాత్రం ఎవ‌రూ మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​

మరింత సమాచారం తెలుసుకోండి: