ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొన్ని వార్తల ఆధారంగా చూస్తే కొంత మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువ జరుగుతుంది. అయితే వాళ్ళు పార్టీ ఎంతవరకు మారతారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా కొంతమంది కీలక నేతల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ మారిపోయినా తనకు ప్రతిపక్ష నేత హోదా పోయినసారి చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు లెక్కచేయడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యే విషయంలో పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదని టాక్. అనుభవం ఉన్న కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యే వైసిపి లో చేరతారని ప్రచారం జరిగినా సరే చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోలేదు అని తెలుగుదేశం పార్టీ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కోసం భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనాచౌదరి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారని వార్తలు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపించాయి.

అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి సదరు ఎమ్మెల్యే కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఉగాది రోజున కచ్చితంగా పార్టీ మారడానికి రెడీ అయ్యారు అనే ప్రచారం రాజకీయాల్లో ఎక్కువగా జరుగుతుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే తాను పార్టీ మారే అంశం గురించి స్పష్టత కూడా ఇచ్చినట్టుగా కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి. అయితే ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణం నారా లోకేష్ అని కూడా వినపడుతుంది. ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ ఆయనను కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయలేదని పర్యటనకు కూడా ఆహ్వానించే ప్రయత్నాలు చేయలేదని కొంతమంది స్థానిక నేతలతో మాట్లాడిన లోకేష్ సదరు ఎమ్మెల్యేతో మాట్లాడలేదని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: