ఔను! తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ప‌న‌బాక ల‌క్ష్మి ఏమ‌య్యారు?  ఎక్క‌డ ఉన్నారు?  తాజాగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు జ‌రిగిన ఘోర అవమానంపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పం దించాయి. భారీ ఎత్తున నిర‌స‌న‌లు, నినాదాలు, గృహ ‌నిర్బంధాల‌తో ఒక‌ర‌కంగా పార్టీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కూ డా ఒక ద‌శ‌లో కీల‌క నేత‌ల‌ను రంగంలోకి దింపి.. వ్య‌తిరేక‌త నుంచి కాపాడుకునే ప్ర‌య‌త్నం చేసింది. న‌ష్ట నివారణ చ‌ర్య‌లు సైతం చేప‌ట్టింది. ఇక‌, టీడీపీ నేత‌లు నిన్న మొన్న‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. వంటివారు యాక్టివ్ అయి.. ఘ‌ట‌న‌ను ఖండిచారు.

ఇక‌, తిరుప‌తి, చిత్తూరు జిల్లాకు చెందిన కీల‌క నేత‌లు మ‌రింత యాక్టివ్ అయ్యారు. త‌మ నాయ‌కుడిని నిర్బంధిస్తారా? అంటూ.. పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. చివ‌ర‌కు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ సైతం ధ‌ర్నా చేసి.. చివ‌ర‌కు గృహ నిర్బంధం అయ్యారు. అయితే.. ఇంత మంది స్పందించి.. ఇన్ని రూపాల్లో నిర‌స‌న లు వ్యక్తం చేసినా, చంద్ర‌బాబు పై జ‌రిగిన ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించినా.. తిరుప‌తి అభ్య‌ర్థిగా ఉన్న‌ప‌న‌బాక ల‌క్ష్మి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

క‌నీసం.. చంద్ర‌బాబు ఘ‌ట‌న విష‌యంలో ఆమె స్పందించ‌లేదు. ఈ విష‌యంలో ఒకింత ఆల‌స్యంగానే దృష్టి పెట్టినా.. టీడీపీ సీరియ‌స్‌గానే స్పందించింది. ఎందుకు ఆమె మౌనం గా ఉన్నారు. వెనుకాల ఏమైనా జ‌రిగిందా?  లేక ప్ర‌భుత్వానికి ఆమె భ‌య‌ప‌డుతున్నారా?  లేక‌.. పార్టీలో ముభావంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. కొంద‌రు మాత్రం ఆమె ముందు నుంచి ఇలానే ఉన్నార‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్ కాలేక పోయార‌ని.. ఇప్పుడు ఆమెను ఎంపిక చేసిన త‌ర్వాత‌కూడా ఇదే ధోర‌ణి అవ‌లంబిస్తున్నార‌ని.. ఇది మంచి ప‌రిణామం కాద‌ని.. అంటున్నారు. అయితే.. ఆమె ఎందుకు ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. క‌నీసం.. చంద్ర‌బాబు ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా కూడా తీసుకోలేదు? అనేది మాత్రం తెలియాల్సి ఉంద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: