దేశంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందా అంటే కాస్త చెప్పడం కష్టం గానే ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఇప్పటివరకు కూడా లేని పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ సృష్టించుకుని ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా ని తీసుకుని వెళుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తో సావాసం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి కూడా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీఎం జగన్ వ్యవహరించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన సన్నిహిత నేతలతో ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయనకు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొంతమంది వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అందుకే జగన్ కూడా కాస్త కాంగ్రెస్ పార్టీ తో సన్నిహితంగా మెలిగితే మంచి ఫలితాలు ఉంటాయి అనే భావనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు. ఒకవేళ బీజేపీ ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ రాజ్యసభ ఎంపీ ద్వారా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: