తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి త్వరలోనే బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ విషయంలో రాహుల్ గాంధీ చాలా సీరియస్గా దృష్టి పెడుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో చర్చలు కూడా జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తెలంగాణలో కొన్ని సమస్యలు కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రంగా ఉన్నాయి. మహిళా నాయకత్వం పెద్దగా బలంగా కనబడుటలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది.

ఇప్పటివరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కాస్త సీరియస్గా దృష్టి పెట్టి మాజీ మంత్రి కొండా సురేఖ తో కూడా పాదయాత్ర చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆమె పాదయాత్ర చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెడీ అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చలు జరిపింది.

ఆమె పాదయాత్ర చేయడం ద్వారా మహిళల్లో చైతన్యం వస్తుంది అనే భావనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. ఇప్పటికే తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త జాగ్రత్తపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ అలాగే టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమై షర్మిల ను రంగంలోకి దించారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: