ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా చేతిలో ఉన్న డబ్బుతో మరింత ఆదాయాన్ని సంపాదించుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కువమంది తమ దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత దీర్ఘకాలంలో మంచి ఆదాయం పొందేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి ఎన్నో రకాల మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి . మ్యూచువల్ ఫండ్స్ లో వివిధ రకాల స్కిమ్స్  అందిస్తున్నాయి. అయితే మీరు ఒకవేళ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తూ ఉంటే మీకోసం దేశీయ అతిపెద్ద ఫండ్ హౌస్ ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీమ్ తీసుకువచ్చింది.



 అయితే ఈ స్కీం లో భాగంగా మీరు భారత స్టాక్ మార్కెట్లో కాదు ఏకంగా అమెరికా స్టాక్ మార్కెట్ లో డబ్బు ఇన్వెస్ట్ చేసి మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇంటర్నేషనల్ ఫండ్స్ వల్ల ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో కూడా డైవర్సిఫైడ్ అవుతుందని ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఆఫీస్ తెలిపింది.  అయితే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఫండ్స్ గత ఐదేళ్లలో 32 శాతం రాబడి అందించినట్లు తెలిపారు. ఇంతకీ ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే ఏమిటి అంటే.. మీరు ఇన్వెస్ట్ చేసే  డబ్బులు అన్నింటినీ కూడా విదేశాల్లో ఈక్విటీ మార్కెట్లో పెడతారూ...  ఆ తర్వాత 80 శాతం మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అందుకే వీటిని ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్స్ అంటారు.



 అయితే ఎస్బిఐ ఇంటర్నేషనల్ ఫండ్ లో కనీసం 5,000 వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.  ఇక సెబీ  రూల్స్ ప్రకారం ఫండ్ ఎక్స్ పెన్స్  రేషియో 2.25 శాతంగా ఉంటుంది. అయితే ఇలా ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ లో డబ్బులు పెట్టే వారు ఒక విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.  అమెరికా డాలర్తో ఇండియా రూపాయి పడిపోతే మరింత అధిక రాబడి లభిస్తుంది.  అయితే ఈ కొత్త ఫండ్  ఎక్కువగా ఐటి స్టాక్స్ లో డబ్బులు పెడుతుంది. ఇలా మీ చేతిలో ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేసి భారీగా ఆదాయం సంపాదించుకునే అనుకునేవారికి ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ ఎంతో మేలు అని సూచిస్తున్నారు  నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: